రెండు ఎకరాలే ఉంది. దానిలో పత్తి, ఇతర పంటలు వేయాలంటే నీరు కావాలి. కరువు కాలంలో సాహసం చేయలేను. దీంతో ఎలాగైనా సరే కూరగాయలు సాగు చేయాలనుకున్నా. నాణ్యమైన కూరగాయలు కావాలంటే పందిరి వేయాలని అనుకుని పందిరి వేయించా. దూరం దూరంగా సాళ్లలో నాలుగు రకాలు చిక్కుడు, కాకర, బీర, దొండ సాగు చేశాను. కాపు బాగా రావడంతో పాటు మంచి నాణ్యతగల కాయలు వస్తున్నాయి. 20 గుంటల వరికి సరిపడే నీటితో రెండు ఎకరాల్లో కూరగాయలు పండుతున్నాయి. మార్కెట్లో రాజు బీరకాయలు వచ్చాయంటే చాలు వ్యాపారులు పోటీపడి కొంటున్నారు. చాలా సంతోషంగా ఉంది.
– జనగం రాజు, రైతు మహ్మదాపురం


