మొగుళ్లపల్లి: హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో జయశంకర్‌భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం కొర్కిశాలకు చెందిన ఓ యువకుడు దుర్మరణం చెందాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ దానవేణి రాములు, అఖిల దంపతుల కుమారుడు యశ్వంత్ (20) హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. ఆదివారం రాత్రి మిత్రుడితో బైక్‌పై వెళ్తున్న క్రమంలో రోడ్డుప్రమాదానికి గురై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మరో విద్యార్థి తీవ్ర గాయాలతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


