సౌత్‌జోన్‌ ఇంటర్‌ వర్సిటీ టోర్నమెంట్‌కు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

సౌత్‌జోన్‌ ఇంటర్‌ వర్సిటీ టోర్నమెంట్‌కు ఎంపిక

Nov 3 2026 1:27 AM | Updated on Nov 3 2026 1:27 AM

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని అంతర్‌ కళాశాలల హాకీ క్రీడాపోటీలు సోమవారం నిర్వహించారు. క్రీడా పోటీలను కేయూ స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ టి.శాస్త్రి, స్పోర్ట్స్‌బోర్డు మాజీ సెక్రటరీ వై.వెంకయ్య ప్రా రంభించారు. ప్రతిభ చూపిన 24 మంది హాకీ క్రీడాకారులను ఎంపిక చేసినట్లు స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ శాస్త్రి తెలిపారు. వీరు సౌత్‌జోన్‌ ఇంటర్‌ యూనివర్సిటీ హాకీ టోర్నమెంట్‌లో పా ల్గొంటారని పేర్కొన్నారు. సెలక్టర్లుగా ఫిజికల్‌ డైరెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, యూసిన్‌, మహేశ్‌, అజ య్‌రెడ్డి, ఫిజికల్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ జా యింట్‌ సెక్రటరీ మట్టెడ కుమార్‌ పాల్గొన్నారు.

బ్యాడ్మింటన్‌ నేషనల్‌

అంపైర్‌గా సునీల్‌

దుగ్గొండి : జాతీయస్థాయి బ్యాడ్మింటన్‌ అంపైర్‌గా వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం పొనకల్‌ గ్రామానికి చెందిన జన్ను సునీల్‌ ఎంపికయ్యారు. ఈ మేరకు తెలంగాణ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సోమవారం ఉత్తర్వులు వెలువరించారు. నేటినుంచి 8వ తేదీ వరకు హైదరాబాద్‌ గచ్చిబౌలిలో జరగనున్న ఇంటర్నేషనల్‌ చాలెంట్‌ –2026 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌కు సునీల్‌ అంపైర్‌గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు సునీల్‌ను సర్పంచ్‌ బొమ్మగాని వెంకటేశ్వర్లు, మాజీ స ర్పంచ్‌లు ఊర్మిళ, కొత్తకొండ శారద, గుండె రా జీరు, బొమ్మగాని సదానందం, వివిధ పార్టీల నాయకులు అభినందించారు.

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

చిన్నగూడూరు: మహబూబాబాద్‌ జిల్లా చిన్న గూడూరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థి గంగాధరి సాత్విక్‌ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు జక్కి నాగేశ్వర్‌ సోమవారం తెలిపారు. ఎస్‌జీఎఫ్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లా స్థాయి అండర్‌–14 ఖోఖో విభాగంలో ప్రతిభ కనబరిచి వికారాబాద్‌ జిల్లాలో జరుగుతున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. మండలానికి పేరు తీసుకురావాలని ఎంఈఓ రవికుమార్‌ ఆకాంక్షించారు.

జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు..

మహబూబాబాద్‌ అర్బన్‌: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల విద్యార్థిని నరాల వెన్నల ఎస్జీఏఎఫ్‌ రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపి జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికై ందని కళాశాల ప్రిన్సిపాల్‌ పొక్కుల సదానందం సోమవారం తెలిపారు. వెన్నలను కళాశాల అధ్యాపకులు సాధిక్‌, శ్రీనివాస్‌, పర్వీనాబేగం, శ్రీను, స్వాతిరాణి, రవికిరణ్‌, నవీన్‌, రియాజ్‌ అభినందించారు.

డ్రంకెన్‌ డ్రైవ్‌లో

26 మందికి జరిమానా

కాశిబుగ్గ: మద్య తాగి వాహనం నడుపుతూ వరంగల్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నిర్వహించిన డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో 26 మంది వ్యక్తులు పట్టుబడినట్లు ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ సు జాత తెలిపారు. వారిని కోర్టులో హాజరు పర్చగా మెజిస్ట్రేట్‌ అంకేశ్వరపు కమలాకర్‌ రూ.19, 200 జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. అ లాగే, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడిపిన ఇద్దరికి రూ. వెయ్యి జరి మానా విధించారని ఆమె వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement