వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవాలి

Nov 3 2026 1:27 AM | Updated on Nov 3 2026 1:27 AM

ఖిలా వరంగల్‌: వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌.శ్వేత సూచించారు. ఈ మేరకు సోమవారం మామూనూరు పోలీస్‌ శిక్షణ కళాశాలలో 302 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 176 మంది ఏఆర్‌ఎస్సైలకు పదోన్నతి శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా సీపీ శ్వేత హాజరై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన సేవలు, చట్టాలపై అవగాహన పెంచుకోవడంతో పాటు పోలీసు వ్యవస్థలో సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు అవసరమైన అంశాలపై శిక్షణ పొందాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ రవీందర్‌, డీఎస్పీలు రమేశ్‌, రవీందర్‌, విజయ్‌కుమార్‌, వెంకటేశ్వర్‌రావు, సోమాని, సీఐలు ఎం.రామ్మూర్తి, నరేందర్‌, అశోక్‌, నరేందర్‌, అశోక్‌, సత్యనారాయణ, రాజ్యలక్ష్మి, ఆర్‌ఐలు నగేశ్‌, నవీన్‌, చంద్రశేఖర్‌, మహేశ్‌, ఆర్‌ఎస్సైలు రాజేశ్‌, సీహెచ్‌ నందకిశోర్‌, అరుణ, రామాంజరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌.శ్వేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement