ఇంటర్‌సిటీకి ఎల్‌హెచ్‌బీ హంగులు! | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌సిటీకి ఎల్‌హెచ్‌బీ హంగులు!

Nov 2 2026 1:17 AM | Updated on Nov 2 2026 1:17 AM

కాకతీయ, హంద్రీతోనూ

అనుసంధానం..

గతంలో నెల రోజులే ఎల్‌హెచ్‌బీ..

సాక్షిప్రతినిధి, వరంగల్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లా రైల్వే ప్రయాణికులకు కీలకమైన ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ ఆధునిక రూపు సంతరించుకోనుంది. హైదరాబాద్‌–సిర్పూర్‌ కాగజ్‌నగర్‌–బీదర్‌ మధ్య నడిచే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ (17011/17012) ఇకపై ఆధునిక ఎల్‌హెచ్‌బీ (లింక్‌ హాఫ్‌మన్‌ బుష్‌) బోగీలతో పరుగులు తీయనుంది. వరంగల్‌, కాజీపేట మీదుగా రాకపోకలు సాగించే ఈ రైలు మార్పుతో హనుమకొండ, వరంగల్‌, జనగామ, మహబూబాబాద్‌, ములుగు, భూపాలపల్లి ప్రాంతాల నుంచి హైదరాబాద్‌ వైపు రాకపోకలు సాగించే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందనున్నాయి. అయితే, ఇప్పటివరకు 16 ఐసీఎఫ్‌ బోగీలతో నడిచిన రైలును 14 ఎల్‌హెచ్‌బీ బోగీలకు పరిమితం చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా కనీసం 20 నుంచి 22 బోగీలతో నడపాలనే డిమాండ్‌ తెరపైకి వస్తోంది.

జర్మన్‌ సాంకేతికతతో ఆధునికీకరణ..

జర్మన్‌ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎల్‌హె చ్‌బీ బోగీలతో ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 3 నుంచి అందుబాటులోకి రానుంది. ఐసీఎఫ్‌ కోచ్‌లతో పోలిస్తే ఎల్‌హెచ్‌బీ బోగీల్లో మెరుగైన సీటింగ్‌ స దుపాయాలు, ఆధునిక భద్రతా ప్రమాణాలు, ప్ర యాణ సౌకర్యాలు ఉంటాయి. కాజీపేట జంక్షన్‌ మీ దుగా ప్రయాణించే ఈ రైలులో మార్పు ఉమ్మడి వ రంగల్‌ ప్రయాణికులకు కూడా ప్రయోజనం చేకూర్చనుంది. అయితే బోగీల సంఖ్య తగ్గడం వల్ల రద్దీ సమయాల్లో సీట్ల కోసం పోటీ మరింత పెరిగే ప్రమాదం ఉందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

రేక్‌ షేరింగ్‌ కష్టాలకు చెక్‌..

ఇంటర్‌సిటీ రైలుకు ఇతర రైళ్లతో ఉన్న రేక్‌ షేరింగ్‌ కారణంగా తరచూ ఆలస్యాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా బీదర్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చే 17012 రైలు గత 15 రోజులుగా రాత్రి 9.30 నుంచి 10.30 గంటల మధ్య సికింద్రాబాద్‌ చేరాల్సి ఉండగా.. మూడు నుంచి నాలుగు గంటలు ఆలస్యంగా వస్తున్నట్లు ప్రయాణికులు చెబుతున్నారు. దీంతో మరుసటి రోజు ఉదయం హైదరాబాద్‌ నుంచి బయలుదేరే రైలు ప్రయాణంపైనా ప్రభావం పడుతోంది. వరంగల్‌, కాజీపేట నుంచి నిత్యం హైదరాబాద్‌కు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు ఈ జాప్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 4 నుంచి సికింద్రాబాద్‌–సిర్పూర్‌ కాగజ్‌నగర్‌–హైదరాబాద్‌ మధ్య కాజీపేట మీదుగా నడిచే పండుగ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ (07711/07712)కు ప్రస్తుతం వినియోగిస్తున్న ఐసీఎఫ్‌ బోగీలను పూర్తిస్థాయిలో కేటాయించనున్నారు. దీంతో ఇంటర్‌సిటీకి రేక్‌ షేరింగ్‌ సమస్య నుంచి కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది.

22 బోగీలతో నడపాలి..

ఉమ్మడి వరంగల్‌ నుంచి హైదరాబాద్‌కు నిత్యం వేలాది మంది ప్రయాణాలు సాగిస్తున్నారు. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, వైద్య సేవల కోసం వెళ్లేవారికి ఇంటర్‌సిటీ కీలకమైన రవాణా సాధనం. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో కాజీపేట, వరంగల్‌ స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో 14 ఎల్‌హెచ్‌బీ బోగీలు సరిపోవని, కనీసం 20 లేదా 22 బోగీలకు పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఇదే మార్గంలో నడిచే భాగ్యనగర్‌, కాగజ్‌నగర్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లు 20 నుంచి 22 ఎల్‌హెచ్‌బీ బోగీలతో నడుస్తున్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఇంటర్‌సిటీకి కూడా అదనపు బోగీలు కేటాయించి రద్దీ సమస్యను పరిష్కరించాలని రైల్వే శాఖను కోరుతున్నారు.

వరంగల్‌–కాజీపేట మీదుగా ఆధునిక బోగీలతో పరుగులు

ఉమ్మడి వరంగల్‌ జిల్లా

ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు

16 ఐసీఎఫ్‌ బోగీల స్థానంలో 14

ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు..

తెరపైకి 20 నుంచి 22 బోగీలకు

పెంచాలని డిమాండ్‌

ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌కు సికింద్రాబాద్‌–భద్రాచలం రోడ్‌ కాకతీయ ఎక్స్‌ప్రెస్‌, హైదరాబాద్‌–కర్నూలు సిటీ హంద్రీ ఎక్స్‌ప్రెస్‌తోనూ రేక్‌ షేరింగ్‌ ఉంది. బతుకమ్మ పండుగ సమయంలో నడిపిన ప్రత్యేక రైలు కూడా ఇదే విధానంలో కొనసాగింది. ప్రస్తుతం ఇంటర్‌సిటీ, కాకతీయ, హంద్రీ రైళ్లను ఈ నెల 3, 4, 5 తేదీల్లో దశలవారీగా ఎల్‌హెచ్‌బీ బోగీలకు మార్చనున్న నేపథ్యంలో రేక్‌ల కేటాయింపుల్లో మార్పులు చేస్తున్నారు. ఈ మార్పులతో వరంగల్‌–కాజీపేట రైల్వే మార్గంలో నడిచే రైళ్ల నిర్వహణలోనూ మెరుగుదల ఉంటుందని ప్రయాణికులు ఆశిస్తున్నారు.

ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ 2016లోనూ ఎల్‌హెచ్‌బీ బోగీలతో నడిచింది. అయితే ఆ ప్రయోగం నెల రోజులకే పరిమితమై తిరిగి ఐసీఎఫ్‌ బోగీలతో కొనసాగింది. దాదాపు పదేళ్ల తర్వాత మరోసారి ఆధునిక బోగీలతో ప్రయాణికులకు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఈసారి శాశ్వతంగా ఎల్‌హెచ్‌బీ రేక్‌ను కొనసాగించాలని ఉమ్మడి వరంగల్‌ ప్రయాణికులు విజ్ఞప్తిచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement