● పోలీసులకు ‘కుడా’ అధికారుల ఫిర్యాదు
కాశిబుగ్గ : వరంగల్ ఓ సిటీ 80ఫీట్ల రోడ్డులోని ‘కుడా’కు చెందిన స్థలాన్ని కొందరు కబ్జాకు యత్నించారు. దీంతో ‘కుడా’ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం కొందరు భూమిని చదును చేసి చుట్టూ తాత్కాలికంగా నిర్మాణం చేపడుతున్న సమాచారం తెలుసుకున్న కుడా అధికారులు ఓ సిటీ స్థలానికి చేరుకున్నారు. అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారితో వాగ్వివాదానికి దిగారు. దీంతో అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి, ఫిర్యాదు చేశారు.


