పర్వతారోహకుడి మరో ఘనత | - | Sakshi
Sakshi News home page

పర్వతారోహకుడి మరో ఘనత

Nov 2 2026 1:17 AM | Updated on Nov 2 2026 1:17 AM

మహారాష్ట్రలోని మౌంట్‌ కల్‌సూబాయ్‌ను అధిరోహించిన భూక్య యశ్వంత్‌

మరిపెడ రూరల్‌ : తెలంగాణకు చెందిన యువ పర్వతారోహకుడు భూక్య యశ్వంత్‌ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. మహారాష్ట్రలోని అత్యంత ఎత్తైన మౌంట్‌ కల్‌సూబాయ్‌ (1,646 మీటర్లు) శిఖరాన్ని అక్టోబర్‌ 30న విజయవంతంగా అధిరోహించాడు. దేశంలోని 28 రాష్ట్రాల అత్యున్నత శిఖరాలపై జాతీయ జెండాను ఎగురవేయాలనే లక్ష్యంతో చేపట్టిన ‘హర్‌ శిఖర్‌ పర్‌ తిరంగా’ జాతీయ యాత్రలో భాగంగా ఈ విజయాన్ని సాధించాడు. దీంతో ఇప్పటివరకు 12 రాష్ట్రాల అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ఘనతను సొంతం చేసుకున్నాడు. శిఖరాగ్రానికి చేరుకున్న యశ్వంత్‌ జాతీయ పతాకంతో పాటు అస్సాం రైఫిల్స్‌ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తి, జాతీయ సమైక్యత, సాయుధ దళాల పట్ల గౌరవాన్ని చాటి చెప్పాడు.

పర్వతారోహణతో పాటు సామాజిక చైతన్యం

యశ్వంత్‌ చేపట్టిన ఈ యాత్ర పర్వతారోహణకే పరిమితం కాకుండా సామాజిక చైతన్యాన్ని పెంపొందించే లక్ష్యంతో కొనసాగుతోంది. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ‘మత్తు పదార్థాలకు నో చెప్పండి..జీవితానికి అవును చెప్పండి’ అనే సందేశాన్ని ప్రచారం చేస్తున్నాడు. బాలికల రక్షణ, విద్య, సమానత్వం, మహిళా సాధికారతపై ప్రజలకు సందేశాన్ని అందిస్తున్నాడు. ముఖ్యంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందించి లక్ష్యసాధన దిశగా ప్రోత్సహిస్తున్నాడు.

ఏడు ఖండాల అత్యున్నత

శిఖరాలే లక్ష్యం..

2020 పర్వతారోహణ ప్రయాణాన్ని ప్రారంభించిన భూక్య యశ్వంత్‌ ఇప్పటివరకు దేశంలోని 28 రాష్ట్రాలకు గాను 12రాష్ట్రాల అత్యున్నత శిఖరాలను అధిరోహించాడు. ప్రపంచంలోని ఏడు ఖండాల్లో మూడు ఖండాల అత్యున్నత శిఖరాలను సైతం అధిరోహించినట్లు తెలిపారు. మిగిలిన రాష్ట్రాల అత్యున్నత శిఖరాలను అధిరోహించడంతో పాటు ఏడు ఖండాల అత్యున్నత పర్వతాలపై భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడమే తన తదుపరి లక్ష్యమని పేర్కొన్నాడు.

ఏడు ఖండాల అత్యున్నత శిఖరాల అధిరోహణే లక్ష్యంగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement