మేడిగడ్డకు మహారాష్ట్ర సీఎస్‌ | - | Sakshi
Sakshi News home page

మేడిగడ్డకు మహారాష్ట్ర సీఎస్‌

Nov 2 2026 1:17 AM | Updated on Nov 2 2026 1:17 AM

కాళేశ్వరం : మేడిగడ్డ బరాజ్‌ను మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (చీఫ్‌ సెక్రటరీ) రాజేష్‌ అగర్వాల్‌ ఆదివారం సందర్శించారు. శనివారం మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ తాలూకాలో పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, అక్కడ పల్లె నిద్ర కార్యక్రమం ముగించుకుని ఆదివారం మేడిగడ్డకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మేడిగడ్డ బరాజ్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం మహారాష్ట్ర వైపు ఉన్న వడిదంలోని ఫాజిల్స్‌ పార్క్‌ తదితర సందర్శనీయ ప్రాంతాలను సందర్శించారు. బరాజ్‌ నిర్మాణం, ప్రాజెక్టు వివరాలు, నీటి లభ్యత, విద్యుత్‌ వినియోగం, టీఎంసీల స్టోరేజీ వివరాలు, ఇతర అంశాలపై సీఎస్‌కు మేడిగడ్డ ఈఈ సురేశ్‌ క్షుణ్ణంగా వివరించారు. సీఎస్‌ పర్యటన సందర్భంగా గడ్చిరోలి కలెక్టర్‌ అవిశాంత్‌పాండేతో పాటు పలువురు అధికారులు, సిబ్బంది ఉన్నారు.

రైతుల

సమస్యలపై ఆరా!

మేడిగడ్డ బరాజ్‌ను మహారాష్ట్ర సీఎస్‌ పరిశీలించడం రెండు రాష్ట్రాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. గోదావరి నది బ్యాక్‌వాటర్‌ వల్ల గడ్చిరోలి జిల్లా సిరోంచ తాలూకాలోని రైతులు ఎదుర్కొంటున్న వ్యవసాయ సమస్యలపై కొంత మంది ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పలువురు రైతులు నేరుగా సీఎస్‌ను కలిసి తమ ఇబ్బందులను వివరించారు. రైతుల సమస్యలను ఆయన ఆలకించారు. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ మధ్య తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై చర్చలు జరిగిన నేపథ్యంలో ఈ పర్యటనకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది.

గడ్చిరోలి జిల్లా పర్యటనలో బరాజ్‌కు రాక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement