వర్షంతో రైతులు ఆగమాగం | - | Sakshi
Sakshi News home page

వర్షంతో రైతులు ఆగమాగం

Nov 1 2026 12:56 AM | Updated on Nov 1 2026 12:56 AM

● కేసముద్రం మార్కెట్‌లో తడిసిముద్దయిన ధాన్యం

● నేలవాలిన వరి చేలు

కేసముద్రం: తుపాన్‌ ప్రభావంతో శనివారం మధ్యాహ్నం కురిసిన వర్షంతో కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం తడిసిముద్దయింది. దీంతో రైతులు ధాన్యాన్ని కాపాడుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చుట్టుపక్కల గ్రామాల రైతులు ఇటీవల మార్కెట్‌కు ధాన్యం బస్తాలను తీసుకువచ్చారు. అయతే వ్యాపారులు తేమసాకు చూపి, తక్కువ ధర పెడుతుండడంతో, చేసేదేమీ లేకక రైతులు ఓపెన్‌యార్డుల్లో ధాన్యాన్ని ఆరబోసుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి, శనివారం మధ్యాహ్నం రెండు గంటల పాటు వర్షం కురిసింది. దీంతో ధాన్యం తడిసి, వరదలో కొట్టుకుపోయింది. రైతులు ధాన్యాన్ని దగ్గరకు చేరుస్తూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే అమీనాపురం, కేసముద్రంవిలేజ్‌, ధన్నసరి, ఉప్పరపల్లి, అర్పనపల్లి, కాట్రపల్లి, కల్వలతోపాటు పలుగ్రామాల్లో వరిపంట నేలవాలింది. పత్తి పంట తడిసిపోయింది. పంట చేతికి అందే సమయంలో వర్షం తమను ఆగం చేసిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement