లెప్రసీ సర్వే.. | - | Sakshi
Sakshi News home page

లెప్రసీ సర్వే..

Nov 1 2026 12:56 AM | Updated on Nov 1 2026 12:56 AM

నెహ్రూసెంటర్‌: జిల్లాలో ప్రమాదకరమైన కుష్టు(లెప్రసీ)వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. వ్యాధి నివారణకు ప్రభుత్వం, వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. వ్యాధి నిర్ధారణ, నిర్మూలన కోసం ఈ నెల 4వ తేదీ వరకు సర్వే చేపట్టనున్నారు. ఈమేరకు 885బృందాలు ఇంటింటి సర్వే చేపడుతున్నాయి. ఇప్పటి వరకు 1,49,462 ఇళ్లు, 4,77,597 మందిని పరీక్షించి, 1520 మంది అనుమానితులను గుర్తించినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

ఇంటింటికి సర్వే బృందాలు..

కుష్టు వ్యాధి నివారణకు జిల్లాలో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ చేట్టారు. ఇంటింటికీ సిబ్బంది వెళ్లి అవగాహన కల్పించడం, అనుమానితులను పరీక్షించడం వంటి కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రజలందరికీ అవగాహన కల్పించడంతో పాటు ఆశవర్కర్లు సర్వేలు నిర్వహించి అనుమానితులను గుర్తించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపిస్తున్నారు. వ్యాధి నిర్ధారణ జరిగితే ఉచితంగా వైద్య చికిత్స అందించనున్నారు.

సర్వేపై సమీక్ష..

లెప్రసీ సర్వేపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్‌ మాట్లాడుతూ.. వ్యాధిని ముందస్తుగా గుర్తించడం ద్వారా నయం చేయవచ్చని తెలిపారు. కుష్టు వ్యాధి సర్వే ఈనెల 4వ తేదీ వరకు నిర్వహిస్తామన్నారు. ఎవరికైనా శరీరంపై స్పర్శ లేని మచ్చలు, ఎరువు, గోధుమరంగు మచ్చలు ఉన్నట్లయితే వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు చేయించుకోలని సూచించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ అర్జున్‌, డీపీఎంఓ వాల్యానాయక్‌, సతీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో ఇంటింటా వివరాల సేకరణ

ఇప్పటివరకు 1,49,462 ఇళ్లు, 4,77,597 మందికి పరీక్షలు

1,520 మంది అనుమానితుల గుర్తింపు

ఈ నెల 4వరకు కొనసాగనున్న సర్వే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement