దాసు సురేశ్‌కు గవర్నర్‌ కోటాలో అవకాశం కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

దాసు సురేశ్‌కు గవర్నర్‌ కోటాలో అవకాశం కల్పించాలి

Nov 1 2026 12:56 AM | Updated on Nov 1 2026 12:56 AM

హన్మకొండ: బీసీ, పద్మశాలి హక్కుల కోసం రెండు దశాబ్దాలుగా పోరాడుతున్న దాసు సురేశ్‌కు గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని కోరుతూ ఉమ్మడి వరంగల్‌ జిల్లా మేధావులు, తెలంగాణ ఉద్యమకారులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజా సంఘాలు ఏకగ్రీ వంగా తీర్మానించాయి. శనివారం హనుమకొండ నక్కలగుట్టలోని హోటల్‌ హరిత కాకతీయలో బీసీ రాజ్యాధికార సమితి, బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ మేధావులు, ఉద్యమకారులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్ర జా సంఘాల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం జనార్దన్‌.. దాసు సురేశ్‌కు గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని ప్రతిపాదించగా సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. బీసీ రాజ్యాధికార స మితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్‌ మా ట్లాడుతూ తనకు బలహీన వర్గాల అండ ఉందని, ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు బుట్టి శ్యాం యాదవ్‌ అధ్యక్షతన జ రిగిన ఈ సమావేశంలో ఆయా సంఘాల నా యకులు, ఉద్యమకారులు దారం జనార్దన్‌, దొంత ఆనందం, ప్రొఫెసర్‌ వీరస్వామి, ప్రొఫెసర్‌ చందా మల్లయ్య, వైద్యం రాజగోపాల్‌, డాక్టర్‌ పరికిపండ్ల అశోక్‌, ఏరుకొండ హైమావ తి, మేరుగు బాబు యాదవ్‌, చాపర్తి కుమార్‌ గాడ్గే, కొండా శ్రీశైలం పాల్గొన్నారు.

● మేధావులు, ఉద్యమకారుల

సమావేశంలో తీర్మానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement