‘మాచన’కు అంతర్జాతీయ బయోఎథికాన్‌ అవార్డు | - | Sakshi
Sakshi News home page

‘మాచన’కు అంతర్జాతీయ బయోఎథికాన్‌ అవార్డు

Nov 1 2026 12:56 AM | Updated on Nov 1 2026 12:56 AM

జనగామ: కామన్‌వెల్త్‌ ఆధ్వర్యంలో 2026 నవంబర్‌లో నిర్వహించనున్న అంతర్జాతీయ బయో ఎథికాన్‌ సదస్సులో భారతదేశానికి చెందిన పలువురికి బయో ఎథికాన్‌ అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డుకు పంజాబ్‌లోని చండీగఢ్‌కు చెందిన ఆచార్య సోనూ గోయల్‌తో పాటు దక్షిణాది నుంచి జనగామ పౌరసర ఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్‌, ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ అధికారి మాచన రఘునందన్‌ ఒక్కరే ఎంపికయ్యారు. పొగాకు, ధూమపానంతో కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మాచన చేసిన అసాధారణ కృషిని కామన్‌వెల్త్‌ ప్రశంసించింది. ఐదేళ్లలో ఐదు వేల కిలోమీటర్లు ప్రయాణించి, 50 వేల గ్రామాల్లో ప్రజలకు పొగాకుకు నో చెప్పండి అనే నినాదంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన కృషికి ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ప్రశంసలు లభించాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో కామన్‌వెల్త్‌ ప్రదానం చేసే బయో ఎథికాన్‌ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శనివారం రఘునందన్‌ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో లభించిన ఈ గుర్తింపు ప్రజారోగ్య పరిరక్షణ కోసం తాను చేస్తున్న కృషికి మరింత ప్రోత్సాహం ఇస్తుందని పేర్కొన్నారు.

జనగామకు చెందిన రఘునందన్‌ కు అరుదైన గుర్తింపు

దక్షిణాది నుంచి ఒక్కరికే అవకాశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement