‘పీఎం రహత్‌’.. ప్రాణాలకు భరోసా | - | Sakshi
Sakshi News home page

‘పీఎం రహత్‌’.. ప్రాణాలకు భరోసా

Nov 1 2026 12:56 AM | Updated on Nov 1 2026 12:56 AM

జనగామ: రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు క్షతగా త్రులను ఆస్పత్రికి తరలించడమే కాకుండా, వారికి తక్షణ వైద్యం అందించేందుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకుండా కేంద్ర ప్రభుత్వం ‘పీఎం రహత్‌’ పథకాన్ని రూపొందించింది. ప్రమాద బాధితులకు గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఏడు రోజుల పాటు నగదు రహిత వైద్య చికిత్స అందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ప్రమాద సమయంలో ప్రాణాలు కాపాడే కీలకమైన తొలి గంటల్లోనే వైద్య సహాయం అందించడంతోపాటు, చికిత్స ఖర్చుల భారం బాధిత కుటుంబాలపై పడకుండా చూడడం ద్వారా ఈ పథకం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం ప్రమాద వివరాల నమోదు, బాధితుల అర్హత నిర్ధారణ, ఆస్పత్రుల్లో చికిత్స, సంబంధిత శాఖల సమన్వయానికి సాంకేతిక వ్యవస్థలను అనుసంధానించారు.

ప్రమాదం జరిగిన వెంటనే నమోదు కీలకం..

పథకం అమలులో ఎలక్ట్రానిక్‌ డిటైల్డ్‌ యాక్సిడెంట్‌ రిపోర్ట్‌ (ఈ–డార్‌) వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బాధితుల వివరాలు, ప్రమాద స్థలం, వాహన సమాచారం సేకరించి నమోదు చేయాలి. టీఎంఎస్‌ 2.0 వ్యవస్థ నుంచి సమాచారం అందిన వెంటనే ఈ–డార్‌ గుర్తింపు సంఖ్య రూపొందించాలి. అనంతరం సంబంధిత వివరాలను ధ్రువీకరించి చికిత్సకు అవసరమైన ప్రక్రియను వేగవంతం చేయాలి. ప్రాణాంతకం కాని ప్రమాదాల విషయంలో 24 గంటల్లో, ప్రాణాంతక ప్రమాదాల విషయంలో 48 గంటల్లో ఈ–డార్‌ ధ్రువీకరణ పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు ప్రక్రియకు కూడా 48 గంటల గడువు సూచించారు.

ఎస్‌హెచ్‌ఓలకు ప్రత్యేక బాధ్యతలు..

పథకం విజయవంతం కావాలంటే ప్రతీ పోలీస్‌స్టేషన్‌ స్థాయిలో అప్రమత్తత అవసరం. స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లు, క్షేత్రస్థాయి సిబ్బంది ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి బాధితులను సమీపంలోని అర్హత కలిగిన ఆస్పత్రులకు తరలించేలా చర్యలు తీసుకోవాలి. అత్యవసర సాయం కోసం 112 సేవలతో సమన్వయం చేసుకోవాలి. అలాగే, ప్రమాద వివరాల నమోదు ఆలస్యం కాకుండా చూడడం, ఈ–డార్‌ గుర్తింపు సంఖ్యను రూపొందించడం, బాధితుల అర్హతను నిర్ధారించడం వంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలి.

పది దశల్లో ప్రమాద నివేదిక ప్రక్రియ..

ఈ–డార్‌ వ్యవస్థలో ప్రమాద నివేదికకు సంబంధించిన పది దశల ప్రక్రియను నిర్దేశించారు. ప్రమాద ప్రాథమిక నివేదిక నుంచి వాహనం, యజమాని, బీమా వివరాల పరిశీలన, ధ్రువీకరణ వరకు వివిధ దశలను నిర్ణీత గడువుల్లో పూర్తి చేయాలి. ప్రతీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ విధానంపై సిబ్బందికి అవగాహన కల్పించడం, ప్రమాదాల వివరాలను సక్రమంగా నమోదు చేయడం, బాధితులకు అందిన వైద్యసేవలను పర్యవేక్షించడం కీలకం.

జనగామ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌

ఆస్పత్రుల్లో సేవలు..

జనగామ జిల్లా ఆస్పత్రితోపాటు ఎంసీహెచ్‌, సీహెచ్‌సీలు బచ్చన్నపేట, పాలకుర్తి, జఫర్‌గఢ్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఏరియా హాస్పిటల్‌, ప్రైవేట్‌ సెక్టార్‌కు సంబంధించి శ్రీసాయి కృష్ణ నర్సింగ్‌హోం, ఎస్‌ఎస్‌కే హాస్పిటల్‌, అజంతా చిల్ట్రన్‌ హాస్పిటల్‌లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.

రూ.1.5 లక్షల వరకు

నగదు రహిత వైద్యం

ఏడు రోజులపాటు

రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్స

ఈ–డార్‌తో వేగంగా వైద్యసాయం

ప్రాణాలు నిలిపే తొలి గంటకు ప్రాధాన్యం

అత్యవసర సహాయం కోసం 112 సేవలు

పీఎం రహత్‌ పథకంలోని ముఖ్యవివరాలు

అంశం వివరాలు

పథకం పేరు పీఎం రహత్‌

చట్టపరమైన ఆధారం మోటారు వాహనాల

చట్టం–1988, సెక్షన్‌ 162

గరిష్ట వైద్య సాయం రూ.1.5 లక్షలు

చికిత్స కాలపరిమితి 7 రోజులు

ప్రాణాంతకం కాని

ప్రమాదాల ధ్రువీకరణ 24 గంటలు

ప్రాణాంతక

ప్రమాదాల ధ్రువీకరణ 48 గంటలు

ఎఫ్‌ఐఆర్‌ నమోదు 48 గంటలు

అత్యవసర సేవలు 112

సాంకేతిక వ్యవస్థలు టీఎంఎస్‌ 2.0, ఈ–డార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement