కేడీసీలో పీజీ కోర్సుల్లో స్పాట్‌ అడ్మిషన్లు | - | Sakshi
Sakshi News home page

కేడీసీలో పీజీ కోర్సుల్లో స్పాట్‌ అడ్మిషన్లు

Nov 1 2026 12:56 AM | Updated on Nov 1 2026 12:56 AM

● ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌

విద్యారణ్యపురి : హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ అండ్‌ పీజీ కళాశాలలో ఈవిద్యాసంవత్సరం 2026–2027లో పీజీ కోర్సుల్లో మిగిలిన సీట్లలో ఈనెల 3వతేదీ వరకు స్పాట్‌ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ గుర్రం శ్రీనివాస్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ కోర్సుల ప్రవేశ పరీక్ష రాసిన అభ్యర్థులు లేదా రాయని వారు కూడా ఈస్పాట్‌ అడ్మిషన్లలో ప్రవేశాలు పొందాలన్నారు. పీజీ కోర్సుల్లో ఎంఏ తెలుగు, ఇంగ్లిష్‌, ఎకనామిక్స్‌, ఎంకాం, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బాటనీ, మ్యాథ్‌మెటిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌లో ఖాళీలున్నాయని, అర్హులైన అభ్యర్థులు ప్రవేశాలు పొందాలన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ అన్ని విద్యార్హతల ఒరిజినల్‌ సర్టిఫికెట్లతోపాటు రెండు జతల జిరాక్స్‌ కాపీలు తీసుకుని కళాశాలకు రావాలన్నారు. మరిన్ని వివరాలకు కళాశాల పీజీ కోర్సుల కోఆర్డినేటర్‌ వాసం శ్రీనివాస్‌ 988 5059533 నంబర్‌లో సంప్రదించాలన్నారు.

పీహెచ్‌డీలో ప్రవేశాలకు గడువు పొడిగింపు

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీలో సోష ల్‌ సైన్సెస్‌ విభాగాల్లో పీహెచ్‌డీలో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈనెల 5వతేదీ వరకు పొడిగించినట్లు డీన్‌ బి. సురేశ్‌లాల్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలను సంబంధిత కేయూ వెబ్‌సైట్‌లో చూడాలని ఆయన సూచించారు.

‘నవోదయ’ హాల్‌టికెట్లు విడుదల

మామునూరు : వరంగల్‌ మామునూరు జవహర్‌ నవోదయ విద్యాలయంలో 2027–2028 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించనున్న పరీక్ష హాల్‌ టికెట్లు వెబ్‌ సైట్‌లో అందుబాటులో ఉంచామని ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ టి. రమేశ్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 28న నిర్వహించనున్న పరీక్ష(జేఎన్‌వీఎస్‌టీ–2027)కు హాజయ్యే విద్యార్థులు వెంటనే హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని చెప్పారు. నవోదయ విద్యాలయ సమితి అధికారిక వెబ్‌ సైట్‌ https://cbseitms.rcil.gov.in/nvs/ ద్వారా హాల్‌ టికెట్లు పొందొచ్చని పేర్కొన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులు హాల్‌ టికెట్లు డౌన్‌ లోడ్‌ చేసి అందులోని పేరు, ఫొటో, పరీక్ష కేంద్రం, తేదీ తదితర వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఏమైనా తప్పులు లేదా వివరాల్లో వ్యత్యాసాలు ఉంటే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ కోరారు

● 28న 6వ తరగతి ప్రవేశ పరీక్ష

● ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ రమేశ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement