● 900మంది క్రీడాకారులు హాజరు
వరంగల్ స్పోర్ట్స్ : హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్ అండర్–14,17 బాలబాలికల పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ క్రీడాంశాల్లో నిర్వహిస్తున్న పోటీలకు 900మంది క్రీడాకారులు, 100 మంది టెక్నికల్ అఫీషియల్స్ హాజరైనట్లు ఎస్‌జీఎఫ్ హనుమకొండ జిల్లా కార్యదర్శి వాసుదేవరావు తెలిపారు. ఇందులో ఎంపికై న క్రీడాకారులు త్వరలో వికారాబాద్‌లో జరగనున్న అండర్–17, మహబూబాబాద్‌లో జరగనున్న అండర్–14రాష్ట్ర స్థాయి స్థాయి పోటీల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున ప్రాతినిథ్యం వహిస్తారని తెలిపారు. అండర్–17 వాలీబాల్ బాలుర విభాగంలో విజేతగా ములుగు, రన్నరప్‌గా భూపాలపల్లి, బాలికల విభాగంలో వరంగల్, ములుగు, వాలీబాల్ అండర్–14 బాలుర విభాగంలో విజేతగా జనగామ, రన్నరప్‌గా వరంగల్, బాలికల విభాగంలో జనగామ విజేతగా, రన్నరప్‌గా హనుమకొండ జట్టు నిలిచింది. ఖోఖో అండర్–17 బాలుర విభాగంలో మహబూబాబాద్, వరంగల్, బాలికల విభాగంలో వరంగల్, ములుగు జట్లు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. అండర్–14 బాలుర విభాగంలో ములుగు, మహబూబాబాద్, బాలికల విభాగంలో హనుమకొండ, ములుగు జట్లు విజేతలుగా నిలిచాయి. కబడ్డీ అండర్–17 బాలుర విభాగంలో వరంగల్, ములుగు, బాలికల విభాగంలో మహబూబాబాద్, వరంగల్, అండర్–14 బాలుర విభాగంలో ములుగు, వరంగల్, బాలికల విభాగంలో మహబూబాబాద్, వరంగల్ జట్లు విజేతలుగా నిలిచినట్లు వాసుదేవరావు తెలిపారు. పోటీల ప్రారంభోత్సవానికి హనుమకొండ జిల్లా గ్రంథాలయ చైర్మన్ అజీజ్ ఖాన్, ముగింపు వేడుకలకు హనుమకొండ ఏసీపీలు నాగన్న, శ్రీనివాస్ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో హనుమకొండ జిల్లా పీఈటీల సంఘం అధ్యక్షుడు ప్రభాకర్‌రెడి, పీఈటీలు రజినీకాంత్, రమేశ్, దేవేందర్, ప్రవీణ్‌రెడ్డి, జగదీశ్వర్, అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


