ఉత్సాహంగా ‘ఏక్తా’ రన్‌ | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా ‘ఏక్తా’ రన్‌

Nov 1 2026 12:56 AM | Updated on Nov 1 2026 12:56 AM

హసన్‌పర్తి : సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా నిర్వహించిన ‘ఏక్తా’ రన్‌ ఉత్సాహంగా సాగింది. శనివారం పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో ఏజే ఫెడల్స్‌ సహకారంతో నిర్వహించిన ప్రదర్శనను పోలీస్‌ కమిషనర్‌ శ్వేత ప్రారంభించారు. పోలీస్‌ కమిషనరేట్‌ నుంచి గోపాలస్వామి ఆలయం, అక్కడి నుంచి మళ్లీ పోలీస్‌ కమిషనరేట్‌ వరకు ప్రదర్శన సాగింది. విద్యార్థులు, వాకర్స్‌, పోలీస్‌ అఽధికారులతో కలిసి సీపీ ఆ ర్యాలీ పాల్గొన్నారు. అనంతరం పోలీస్‌ కమిషనర్‌ శ్వేత మాట్లాడుతూ సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ జయంతి సందర్భంగా నిర్వహించిన ఏక్తారన్‌ జాతీయ ఐక్యత, సమగ్రతపై ప్రజల్లో స్ఫూర్తి నింపడంతోపాటు ఆరోగ్యకర జీవన శైలి, శారీరక దృఢత్వంపై అవగాహన పెంపొందించేందుకు దోహదపడుతోందన్నారు. దేశ సమగ్రత, ఐక్యతకు సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ చేసిన సేవలను కొనియాడారు అనంతరం పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. బల్దియా కమిషనర్‌ వెంకన్న, డీసీపీ అంకిత్‌కుమార్‌, అదనపు డీసీపీ ఆర్‌. ప్రభాకర్‌రావు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.

పటేల్‌కు ఘన నివాళి..

కమిషనరేట్‌లో నిర్వహించిన సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి వేడుకల్లో సీపీ శ్వేత పాల్గొన్నారు. ఈసందర్భంగా పటేల్‌ చిత్రపటానికి పూలమాల వే సి నివాళులర్పించారు. సెంట్రల్‌ జోన్‌ డీసీపీ దార కవిత, అడిషనల్‌ డీసీపీ ఆర్‌. ప్రభాకర్‌రావు, ఏసీపీలు మధుసూదన్‌, జానీ నర్సింహులు, ఏఆర్‌ అదనపు డీసీపీ సురేశ్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

సీపీ కార్యాలయం నుంచి గోపాలస్వామి గుడి వరకు ప్రదర్శన

జాతీయ ఐక్యత స్ఫూర్తి చాటాలి : సీపీ శ్వేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement