రఘునాథపల్లి: ఇష్టంలేని పెళ్లి సంబంధంతో మనస్తాపానికి గురైన ఓ యువతి రైలులోనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండల పరిధిలో శనివారం తెల్ల వారుజామున చోటుచేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా నర్మెట మండలం అమ్మాపురానికి చెందిన కుంటి బాబురావు కుటుంబం సుమారు 20 ఏళ్ల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం శేషగిరినగర్ కాలనీకి వెళ్లి స్థిరపడ్డారు. బాబురావు ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన కుమార్తె శ్రావణి (24) ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తోంది. చిన్నప్పటినుంచి తల్లిదండ్రుల గారాలపట్టిగా పెరిగిన ఆమెకు కొంతకాలం క్రితం మేనబావతో వివాహం నిశ్చయమైంది.
రైలు ప్రయాణంలో విషాదం..
గత నెల30వ తేదీ (శుక్రవారం) రాత్రి పెళ్లిదుస్తులు కొనుగోలు చేసేందుకు శ్రావణి మణుగూరు ఎక్స్‌ప్రెస్ రైలులో సికింద్రాబాద్‌కు బయలుదేరింది. ప్రయాణ సమయంలో ఒకట్రెండుసార్లు కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడింది. శనివారం తెల్ల వారుజామున సుమారు 2.30 గంటల సమయంలో రఘునాథపల్లి మండల శివారు ప్రాంతంలో రైలులోనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు గుర్తించారు.
జనగామ జిల్లా రఘునాథపల్లి
సమీపంలో ఘటన
స్వగ్రామం జనగామ జిల్లా నర్మెట మండలం అమ్మాపురం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
లక్ష్మీదేవిపల్లి మండలం శేషగిరినగర్ కాలనీలో స్థిరనివాసం


