గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ కాకతీయుల ప్రత్యేకత | - | Sakshi
Sakshi News home page

గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ కాకతీయుల ప్రత్యేకత

Nov 1 2026 12:56 AM | Updated on Nov 1 2026 12:56 AM

వెంకటాపురం(ఎం): కాకతీయుల కాలంలో గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ నీటిపారుదల రంగంలో కీలక పాత్ర పోషించిందని తెలంగాణ జలవనరుల సంస్థ మాజీ చైర్మన్‌ వి. ప్రకాశ్‌రావు అన్నారు. ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలంలోని రామప్పలో నిర్వహిస్తున్న వరల్డ్‌ హెరిటేజ్‌ వలంటీర్‌ శిక్షణ శిబిరానికి ఆయన శనివారం హాజరై మాట్లాడారు. వరంగల్‌ జిల్లా నుంచి నల్లగొండ ప్రాంతం వరకు కాకతీయులు అభివృద్ధి చేసిన చెరువులు, కాల్వల వ్యవస్థ నేటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. నిజాం పాలనలో 1907 నుంచి 1909 మధ్య చెరువులు, కాల్వల సంరక్షణకు గణనీయంగా నిధులు వెచ్చించినట్లు పేర్కొన్నారు. పురాతన నీటిపారుదల వ్యవస్థల ప్రాధాన్యాన్ని నేటి తరానికి తెలియజేయడంతోపాటు వాటి పరిరక్షణకు కృషి చేయాలని వలంటీర్లకు సూచించారు. శిబిరం తొమ్మిదో రోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం యోగా గురువు రాంబాబు ఆధ్వర్యంలో వలంటీర్లకు యోగాసనాల్లో శిక్షణ ఇచ్చారు. అనంతరం ఎన్‌ఐటీ వరంగల్‌ ప్రొఫెసర్‌ రమణమూర్తి వారసత్వ కట్టడాల పరిరక్షణలో సివిల్‌ ఇంజనీరింగ్‌ పాత్రను వివరించారు. ఎన్‌ఐటీ వరంగల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ రతీష్‌కుమార్‌ పురాతన కట్టడాల మరమ్మతులకు ఉపయోగపడే సుస్థిర సున్నపు మిశ్రమాల వర్గీకరణ, అభివృద్ధిపై బోధించారు. అనంతరం ప్రకాశ్‌రావుతో పాటు ప్రొఫెసర్లను ఇంటాక్‌ కన్వీనర్‌ పాండురంగారావు, ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ శ్రీధర్‌రావు, కాకతీయ హెరిటేజ్‌ ట్రస్ట్‌ సభ్యుడు శ్రీనివాస్‌, టూరిజం గైడ్‌ విజయ్‌కుమార్‌ సన్మానించారు.

● తెలంగాణ జలవనరుల సంస్థ మాజీ చైర్మన్‌ ప్రకాశ్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement