హసన్పర్తి: ఎస్సార్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న ఎస్సార్యూ–మున్–2026 కార్యక్రమం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈకార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన 650 మంది విద్యార్థులు తమపేర్లు నమోదు చేసుకున్నారు. ఈసందర్భంగా డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ డాక్టర్ ఎ.వి.వి. సుధాకర్ మాట్లాడుతూ తరగతి గది అభ్యాసంతోపాటు బాహ్య ప్రపంచంలోని అనుభవాలు విద్యార్థుల జ్ఞానాన్ని మరింత విస్తృతం చేస్తాయన్నారు. వాతావరణ మార్పులు, ఎల్నినో వంటి ప్రపంచ వ్యాప్త పరిణామాలపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలన్నారు. స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐ డీన్ ప్రొఫెసర్ శశికళ మాట్లాడు తూ ఇలాంటి వేదికలను విద్యార్థులు సద్విని యోగం చేసుకుని నాయకత్వపు లక్షణాలు, ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. తొలుత జ్యోతి ప్రజ్వ లన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రోగ్రాం కన్వీనర్ సల్లావుద్దీన్, డాక్టర్ డి.రమేశ్, వివిధ విభాగాలకు చెందిన అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


