వరంగల్ స్పోర్ట్స్ : హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్–14, అండర్–17 బాలబాలికల అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఈ పోటీలకు ఉమ్మడి వరంగల్ జిల్లా నలుమూలల నుంచి సుమారు 800 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ కార్యదర్శి సారంగపాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఎంపికల్లో ప్రతిభ కనబరిచి ఎంపికై న క్రీడాకారులు నవంబర్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వరంగల్ జిల్లా పాఠశాల క్రీడా కార్యదర్శి వరికోటి వాసుదేవరావు తెలిపారు. ఎంపికల నిర్వహణలో సుమారు 100 మంది వ్యాయామ విద్య ఉపాధ్యాయులు, వ్యాయామ దర్శకులు పాల్గొన్నారు. టెక్నికల్ అఫీషియల్స్‌గా సాంబమూర్తి, రజనీకాంత్, అశోక్, మనోజ్‌కుమార్, చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీదేవి, రవీంద్రప్రసాద్‌తో పాటు వ్యాయామ విద్య ఉపాధ్యాయుల అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, పీడీలు రాముడు, సురేశ్, హరీష్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.


