● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి
హసన్‌పర్తి: విద్యార్థులు సృజనాత్మక ఆలోచనలతో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి అన్నారు. నగరంలోని కిట్స్ కళాశాలలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న జాతీయ స్థాయి విద్యార్థి సాంకేతిక సింపోజియం ‘సంశోధిని–2026’ శుక్రవారం ప్రారంభమైంది. స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈకార్యక్రమానికి వరుణ్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఆత్మ విశ్వాసం, ఆత్మగౌరవంతోపాటు కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంపొందించుకోవాలన్నారు. స్వల్ప కాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలన్నారు. కిట్స్ పూర్వ విద్యార్థి, రీజియన్ అకడమిక్ అలయన్సెన్ హెడ్, రిచర్డ్ కింగ్ చత్రగడ్డ మాట్లాడుతూ సమస్యలు గుర్తించి వాటిని సమర్థవంతమైన పరిష్కారాలు కనుగొనే నైపుణ్యం విద్యార్థులకు ఎంతో అవసరమన్నారు. కళాశాల అదనపు కార్యదర్శి సతీశ్‌కుమార్, ప్రొఫెసర్ శ్రీధర్, ప్రిన్సిపాల్ అశోక్‌రెడ్డి, పారిశ్రామిక వేత్త వెంకట్రామిరెడ్డి, పీఆర్వో ప్రభాకరాచారి తదితరులు పాల్గొన్నారు.


