8వ రోజు కొనసాగిన వలంటీర్ల శిక్షణ | - | Sakshi
Sakshi News home page

8వ రోజు కొనసాగిన వలంటీర్ల శిక్షణ

Oct 31 2026 8:01 AM | Updated on Oct 31 2026 8:01 AM

వెంకటాపురం(ఎం): ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలం రామప్పలో నిర్వహిస్తున్న వరల్డ్‌ హెరిటేజ్‌ వలంటీర్‌ శిక్షణ శిబిరం ఎనిమిదో రోజు కొనసాగింది. శుక్రవారం ఉదయం యోగా గురువు రాంబాబు వలంటీర్లకు యోగసానాలు నేర్పించారు. ఐఐటీ హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ కౌశిక్‌ శ్రీధరన్‌ దేశ పూర్వ విజ్ఞానం మొత్తం వారసత్వ కట్టడాల్లో ఉందని, టెక్నాలజీ ఉపయోగించి దానిని ఎలా డీకోడింగ్‌ చేయాలో వివరించారు. డెక్కన్‌ హెరిటేజ్‌ ఫోరం ఫర్‌ బెటర్‌ చైర్మన్‌ వేద కుమార్‌ మాట్లాడుతూ 3,500 సంవత్సరాల క్రితం ముదుమయాలలో నిర్మించిన రాతి యుగం కట్టడాలు ప్రపంచంలో అత్యంత ప్రాధాన్యం కలిగిన కాలమణిని చూపిస్తాయని, దానిని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు తేవడానికి చేస్తున్న ప్రయత్నం గురించి వివరించారు. సాయంత్రం రామప్ప సరస్సు కట్టపై ఉన్న త్రికూట ఆలయాల వద్ద వలంటీర్లు శ్రమదానం నిర్వహించారు. ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ శ్రీధర్‌ రావు, కాకతీయ హెరిటేజ్‌ ట్రస్ట్‌ సభ్యుడు శ్రీనివాస్‌, టూరిజం గైడ్‌ విజయ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement