డోర్నకల్: డోర్నకల్ రైల్వే జంక్షన్ పరిధిలోని గూడ్స్‌యార్డును శుక్రవారం రైల్వే ఉన్నతాధికారులు పరిశీలించారు. డీసీఓఎం కె.పద్మజ, పీసీఎంఈ ఎం.విజయకుమార్‌తో పాటు పలువురు అధికారులు గూడ్స్ యార్డు లైన్లతో పాటు షెడ్డు, అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. యార్డు అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై స్థానిక అధికారులతో చర్చించారు. డీఆర్‌యూసీసీ సభ్యులు ఖాదర్ అధికారులను కలిసి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల కోసం మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులు సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎంఈ గౌతమ్, సీనియర్ డీఎంఈ రవీంద్రనాథ్, సీనియర్ డీఓఎం నరేంద్రవర్మ, సీనియర్ డీఈఎన్ శశాంక్, సీ అండ్ డబ్ల్యూ ఎస్‌ఎస్‌ఈ బాబు తదితరులు పాల్గొన్నారు.
వీపీఓలు గ్రామాలను సందర్శించాలి
బయ్యారం: గ్రామ పోలీస్ అధికారులు(వీపీఓ) తప్పనిసరిగా గ్రామాలను సందర్శించాలని డీఎస్పీ తిరుపతిరావు సూచించారు. శుక్రవారం బయ్యారం పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. పాత నేరస్తులపై నిఘా ఉంచడంతో పాటు రాత్రిపూట పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. అనంతరం ఆయన పలు రికార్డులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో గార్ల–బయ్యారం సీఐ రవీందర్, ఎస్సై ప్రశాంత్‌బాబు పాల్గొన్నారు.
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
నెహ్రూసెంటర్: యువత మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో శుక్రవారం ‘నషా ముక్త్ యువ వికసిత్ భారత్’ అవగాహన పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. మత్తు పదార్థాలు, చెడు వ్యసనాల వల్ల కలిగే అనారోగ్య సమస్యలు, దుష్పరిమాణాలపై ప్రజలకు అవగాహన కల్పించి చైతన్యం చేయాలని సూచించారు. మానుకోటను నషా ముక్త్ జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రగతి గ్రామీణాభివృద్ధి సంఘం అధ్యక్షుడు రాజు, డెమో రాజ్‌కుమార్, సీహెచ్‌ఓ జ్ఞాన సుందరి, భాగ్యలక్ష్మి, సూపరింటెండెంట్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
నేడు సైబర్ సెక్యూరిటీ ఫ్లాష్ వాక్
మహబూబాబాద్ రూరల్ : సైబర్ నేరాలను అదుపుచేసే లక్ష్యంతో పోలీసు శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. నేరాల కట్టడిపై యుద్ధానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ శాఖ సహకారంతో సైబర్ సెక్యూరిటీ ఫ్లాష్ వాక్–2026 శనివారం నిర్వహించేందుకు ఎస్పీ శబరీష్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, మీడియా ప్రతినిధులు, విద్యార్థులు, యువత, అన్ని వర్గాల పౌరులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆహ్వానించారు. సాయంత్రం జిల్లా కేంద్రంలోని నెహ్రూ సెంటర్ నుంచి సైబర్ సెక్యూరిటీ ఫ్లాష్ వాక్ ప్రారంభమై మూడుకొట్ల సెంటర్ వరకు కొనసాగుతుంది.
తైక్వాండో జట్ల ఎంపికలు
కేయూ క్యాంపస్: కేయూ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల నుంచి వివిధ కళాశాలల విద్యార్థులకు అంతర్ కళాశాలల తైక్వాండో పోటీలను శుక్రవారం కేయూలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. స్పోర్ట్స్ బోర్డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో పురుషుల విభాగంలో ఆరుగురు, మహిళల విభాగం నుంచి నలుగురు క్రీడాకారులను ఎంపిక చేశారు. పురుషుల జట్టును రాజస్థాన్‌లోని జైపూర్‌లో గ్లోబల్ యూనివర్సిటీలో నిర్వహించనున్న ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు ఎంపిక చేసినట్లు కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ డాక్టర్ టి.శాస్త్రి, ఇన్‌చార్జ్ డాక్టర్ కుమార్ తెలిపారు. మహిళల జట్టు ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఉన్న శారదా యూనివర్సిటీలో నిర్వహించనున్న ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ తైక్వాండో పోటీల్లో పాల్గొంటుందని వారు పేర్కొన్నారు.


