పట్టణ అభివృద్ధికి సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

పట్టణ అభివృద్ధికి సహకరించాలి

Oct 31 2026 6:14 AM | Updated on Oct 31 2026 6:14 AM

● కలెక్టర్‌ స్నేహ శబరీష్‌

డోర్నకల్‌: డోర్నకల్‌ మున్సిపాలిటీ పరిధిలోని గాంధీసెంటర్‌, కూరగాయల మార్కెట్‌ అభివృద్ధికి స్థానికులు సహకరించాలని కలెక్టర్‌ స్నేహశబరీష్‌ కోరారు. గాంధీ సెంటర్‌తో పాటు కూరగాయల మార్కెట్‌, ముత్యాలమ్మగుడి, మసీదు కాంప్లెక్స్‌ దుకాణాలను పరిశీలించారు. మసీదు కాంప్లెక్స్‌లోని కొన్ని దుకాణాలు రోడ్డుపైకి వచ్చాయని, దుకాణదారులందరికీ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. గాంధీ సెంటర్‌లో రోడ్డు అభివృద్ధికి మసీదు కమిటీతో పాటు ముత్యాలమ్మతల్లి ఆలయ ప్రతినిధులు సహకరించాలని కోరారు. రోడ్డు వెడల్పుతో దుకాణాలు తొలగిస్తే దుకాణదారులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారని, మసీదులో పని చేసే ముగ్గురు ఉపాధి కోల్పోతారంటూ స్థానిక ముస్లింలు కలెక్టర్‌ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులు సకాలంలో పూర్తయ్యేలా ఈ ప్రాంతవాసులు సహకరించాలని కలెక్టర్‌ కోరారు. అనంతరం కూరగాయల మార్కెట్‌ను సందర్శించి నిలిచిపోయిన భవన నిర్మాణ పనులను పరిశీలించారు. కూరగాయల మార్కెట్‌కు సంబంధించిన రికార్డులను తమకు అందించాలని మున్సిపల్‌ కమిషనర్‌ నాగరాజును ఆదేశించారు. మార్కెట్‌లోని దుకాణాల గురించి ఆరా తీశారు. మసీదు కాంప్లెక్స్‌లో దుకాణాలు కోల్పోతున్న వారికి మార్కెట్‌ భవనంలో దుకాణాలు కేటాయించే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు. ఇన్‌చార్జ్‌ అడిషనల్‌ కలెక్టర్‌ పురుషోత్తం, మున్సిపల్‌ కమిషనర్‌ నాగరాజు, వైస్‌చైర్‌పర్సన్‌ మాదా లావణ్యాశ్రీనివాస్‌, తహసీల్దార్‌ రాఘవరెడ్డి, ఎంపీడీఓ ఆంజనేయులు, ఏఈ శ్వేత, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

నిర్మాణాలు వేగవంతం చేయాలి

మహబూబాబాద్‌: వీఓ భవన నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్‌ స్నేహశబరీష్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో శుక్రవారం వీఓ భవనాల నిర్మాణాలు తదితర విషయాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో 387 భవనాలు మంజూరు కాగా.. 90 భవనాల నిర్మాణాలు ప్రారంభం కాలేదని, అవి ప్రారంభమమ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నిధులు సకాలంలో విడుదలయ్యేలా చూడాలన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించేలా ఇంజనీరింగ్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించాలన్నారు. నిర్ణీత గడువులోగా భవనాల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. వీబీజీ రామ్‌జీ పథకం ద్వారా కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement