రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి | - | Sakshi
Sakshi News home page

రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి

Oct 31 2026 6:14 AM | Updated on Oct 31 2026 6:14 AM

మహబూబాబాద్‌ రూరల్‌: ఎల్‌నినో నేపథ్యంలో ప్రజలు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌ సూచించారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విద్యుత్‌ శాఖ, మిషన్‌ భగీరథ, ఇరిగేషన్‌ శాఖ, పంచాయతీరాజ్‌ శాఖ, గ్రిడ్‌ మిషన్‌ భగీరథ శాఖ అధికారులతో ఎమ్మెల్యే శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్‌ను ప్రతీ ఒక్కరు పొదుపుగా వినియోగించుకోవాలన్నారు. అనవసర విద్యుత్‌ వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు సూచించారు. వ్యవసాయ రంగానికి విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు లేకుండా చూడాలని, రైతులకు సాగునీటి విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో నీటి లభ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇరిగేష శాఖ అధికారులు అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇది ఒక ముందస్తు హెచ్చరికగా భావించి అన్ని శాఖల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, రాబోయే విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా, రైతులకు సాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. సమావేశంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement