పీఓహెచ్‌, ఆర్‌ఓహెచ్‌ పనులు ప్రారంభించాలి | - | Sakshi
Sakshi News home page

పీఓహెచ్‌, ఆర్‌ఓహెచ్‌ పనులు ప్రారంభించాలి

Oct 31 2026 6:14 AM | Updated on Oct 31 2026 6:14 AM

మహబూబాబాద్‌ రూరల్‌: మహబూబాబాద్‌లో వందేభారత్‌ మెగా మెయింటెనెన్స్‌ డిపో (పీఓహెచ్‌, ఆర్‌ఓహెచ్‌ వర్క్‌షాప్‌) పనులు వెంటనే ప్రారంభించాలని కోరుతూ శుక్రవారం న్యూఢిల్లీలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి, పలువురు ఎంపీలతో కలిసి ఎంపీ పోరిక బలరాంనాయక్‌ వినతిపత్రం అందజేశారు. మహబూబాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని పలు పెండింగ్‌ రైల్వే ప్రాజెక్టులు, ప్రయాణికుల సమస్యలపై కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ బలరాంనాయక్‌ మాట్లాడుతూ.. మహబూబాబాద్‌ జిల్లా పరిధిలో మంజూరైన వందేభారత్‌ మెగా మెయింటెనెన్స్‌ డిపో పనులకు త్వరగా శంకుస్థాపన చేయాలని కోరారు. అలాగే మహబూబాబాద్‌ రైల్వే స్టేషన్‌లో 4వ నంబర్‌ ప్లాట్‌ఫాం లేకపోవడం వల్ల ప్రయాణికులు, ముఖ్యంగా వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మహబూబాబాద్‌, కేసముద్రం, డోర్నకల్‌, నెక్కొండ, మణుగూరు రైల్వే స్టేషన్లలో పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు హాల్టింగ్‌ కల్పించాలని, ఆయా స్టేషన్లలో మౌలిక వసతులు మెరుగుపరచాలని కోరారు. రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్‌, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్‌ రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి, గడ్డం వంశీ ఉన్నారు.

కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన ఎంపీ బలరాంనాయక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement