అశ్వవాహనంపై స్వామివారి పారువేట | - | Sakshi
Sakshi News home page

అశ్వవాహనంపై స్వామివారి పారువేట

Oct 31 2026 6:14 AM | Updated on Oct 31 2026 6:14 AM

గార్ల: మండలంలోని మర్రిగూడెం వేట వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం స్వామివారి పారువేట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అశ్వవాహనంపై స్వామివారు గ్రామ చివర వరకు వెళ్లి బొడ్డులో ఉన్న తన కత్తితో గొర్రెపోతు చెవి కోసి తిరిగి దేవాలయానికి చేరుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు అచ్యుతాచార్యులు, గోవిందాచార్యులు స్వామివారికి పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ అజ్మీరా బన్సీలాల్‌, వైస్‌చైర్మన్‌ బానోత్‌ అర్జున, భూక్య కస్నానాయక్‌, ఆలయ ఈఓ సత్యనారాయణ, బోజ్యానాయక్‌, కోట శ్రీనివాస్‌, సంపత్‌, జగ్గయ్య, భక్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement