బాలల భవిష్యతే దేశానికి నిజమైన సంపద | - | Sakshi
Sakshi News home page

బాలల భవిష్యతే దేశానికి నిజమైన సంపద

Oct 31 2026 6:14 AM | Updated on Oct 31 2026 6:14 AM

తొర్రూరు: బాలల భవిష్యతే దేశానికి నిజమైన సంపద అని తొర్రూరు జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి దామెర ధీరజ్‌కుమార్‌ తెలిపారు. డివిజన్‌ కేంద్రంలోని అభ్యాస్‌ హైస్కూల్‌లో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. బాలల హక్కులు, బాల్య వివాహాల నిరోధం, ర్యాగింగ్‌ నిరోధక చట్టాలు, మహిళల రక్షణ చట్టాలు, లైంగిక వేధింపుల నిరోధక చట్టం, పోక్సో యాక్టు గురించి వివరించారు. బాలికలకు జరుగుతున్న అన్యాయాలు, లై ంగిక వేధింపులను అరికట్టడానికి చట్టాలు రక్షణ కవచంలా ఉపయోగపడతాయన్నారు. ఎక్కడైనా బాలికలు వేధింపులకు గురైతే వెంటనే 1098, 112 టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్‌ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మహంకాళి బుచ్చయ్య, ప్రిన్సిపాల్‌ కేతిరెడ్డి సుమలత, న్యాయవాదులు రామకృష్ణ, అశోక్‌ పాల్గొన్నారు.

తొర్రూరు జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి దామెర ధీరజ్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement