విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యమివ్వాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యమివ్వాలి

Oct 31 2026 6:14 AM | Updated on Oct 31 2026 6:14 AM

తొర్రూరు: విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని డిప్యూటీ సీఈఓ అనురాధ తెలిపారు. తొర్రూరు పట్టణంలోని సంక్షేమ బాలికల వసతిగృహం, ఎస్టీ హాస్టల్‌, కస్తూర్బా బాలికల పాఠశాలను శుక్రవారం రాత్రి డిప్యూటీ సీఈఓ తనిఖీ చేశారు. వసతిగృహాల్లోని గదులు, కిచెన్‌, మెస్‌, పారిశుద్ధ్య నిర్వహణ, బాలికలకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. తనిఖీ సందర్భంగా విద్యార్థినులు పలు సమస్యలను డిప్యూటీ సీఈఓ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని, నాణ్యమైన ఆహారం అందడం లేదని విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. వసతిగృహాల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని ఆమె హెచ్చరించారు. సమస్యలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

డిప్యూటీ సీఈఓ అనురాధ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement