67ఉద్యోగాలు.. 4వేల దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

67ఉద్యోగాలు.. 4వేల దరఖాస్తులు

Oct 30 2026 2:09 AM | Updated on Oct 30 2026 2:09 AM

నెహ్రూసెంటర్‌: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఎన్‌హెచ్‌ఎం పరిధిలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. మొత్తం 67 ల్యాబ్‌ టెక్నీషియన్‌, స్టాఫ్‌నర్సు, ఏఎన్‌ఎం, ఎంఎల్‌హెచ్‌పీ, ఇతర ఉద్యోగ ఖాళీలకు.. 4,200 దరఖాస్తులు వచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గురువారం తెలిపారు. దరఖాస్తులను పరిశీలించి స్క్రూట్నీ చేసి మెరిట్‌ జాబితాను తయారు చేయనున్నారు. గతంలో చేపట్టిన ఉద్యోగాల భర్తీలో అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం నిబంధనల ప్రకారం ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రక్రియ జరుగుతుందని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement