నిజాయితీగా విధులు నిర్వర్తించాలి | - | Sakshi
Sakshi News home page

నిజాయితీగా విధులు నిర్వర్తించాలి

Oct 30 2026 2:09 AM | Updated on Oct 30 2026 2:09 AM

● ఏసీబీ వరంగల్‌ రేంజ్‌ డీఎస్పీ సాంబయ్య

మహబూబాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగులు నిజాయితీగా విధులు నిర్వర్తించాలని ఏసీబీ వరంగల్‌ రేంజ్‌ డీఎస్పీ సాంబయ్య అన్నారు. విజిలెన్స్‌ వారోత్సవాల సందర్భంగా అవినీతి నిరోధకశాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో నిజాయితీ, పారదర్శకత, నైతిక విలువల ప్రాముఖ్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు. అవినీతికి దూరంగా ఉంటూ, విధి నిర్వహణలో నిజాయితీ, నిబద్ధత, పారదర్శకత పాటిస్తామని, అవినీతి రహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈసందర్భంగా డీఎస్పీ సాంబయ్య మాట్లాడుతూ.. విజిలెన్స్‌ వారోత్సవాల్లో భాగంగా ఈనెల 26నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సత్యనిష్టతో సమృద్ధి అనే నినాదం తో పలు కార్యక్రమాలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ అధికారాలను వ్యక్తిగత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయవద్దన్నారు. అవినీతి వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్నారు. ఎవరైనా ఉద్యోగి లంచం అడిగితే తెలంగాణ ఏసీబీ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1064కు ఫిర్యాదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌, ఇన్‌చార్జ్‌ అదనపు కలెక్టర్‌ పురుషోత్తం, జిల్లాస్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement