రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలి | - | Sakshi
Sakshi News home page

రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలి

Oct 30 2026 2:09 AM | Updated on Oct 30 2026 2:09 AM

● ఎస్పీ శబరీష్‌

తొర్రూరు: రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవా లని ఎస్పీ శబరీష్‌ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని గురువారం పట్టణంలోని లయన్స్‌క్లబ్‌ భవనంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పోలీసులు, స్థానికుల నుంచి 130 యూనిట్ల రక్తం సేకరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో డీఎస్పీ కృష్ణకిశోర్‌తో కలిసి ఎస్పీ మాట్లాడారు. రక్తదానం మరొకరి జీవితానికి వెలుగును ప్రసాదిస్తుందన్నారు. మూడు మాసాలకోసారి రక్తదానం చేయడం వల్ల సదరు వ్యక్తి ఆరోగ్యంగా ఉండడంతో పాటు మరొకరికి ప్రాణదానం చేసినవారవుతారన్నారు. పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. సమాజంలో సేవాభావాన్ని పెంపొందించడంలో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో రాజీపడబోమన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ గణేశ్‌, ఎస్సైలు తోట మహేందర్‌రెడ్డి, ప్రమోద్‌కుమార్‌, వెంకన్న, ఖాదర్‌పాషా, కట్టమ ల్లు, లయన్స్‌కబ్‌ ప్రతినిధులు డాక్టర్‌ రాజేందర్‌రెడ్డి, కృష్ణమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement