ఘనంగా వేంకటేశ్వరస్వామి తెప్పోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా వేంకటేశ్వరస్వామి తెప్పోత్సవం

Oct 30 2026 2:09 AM | Updated on Oct 30 2026 2:09 AM

గార్ల: బ్రహ్మోత్సవాల్లో భాగంగా మండలంలోని మర్రిగూడెం వేట వేంకటేశ్వరస్వామి వారి తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గురువారం దేవాలయం ఎదుట ఉన్న కోనేరులో తెప్పోత్సవం నిర్వహించారు. తొలుత స్వామివారి ఉత్సవ విగ్రహాలను కోనేరులోకి దింపి ప్రత్యేకంగా పూలమాలలతో అలంకరించిన శకటంపై ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తెప్పోత్సవం నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గార్లబయ్యారం సీఐ, ఎస్సై రవీందర్‌, సాయికుమార్‌ ఆలయ ప్రాంగణంలో పటిష్టమైన పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ అజ్మీరా బన్సీలాల్‌, వైస్‌చైర్మన్‌ బానోత్‌ అర్జున, ఆలయ ఈఓ సత్యనారాయణ, కమిటీ సభ్యులు నాగరాజు, మండ సుమత, వల్లభనేని రవి, మర్రిగూడెం, గార్ల సర్పంచ్‌లు భూక్య రాంసింగ్‌, బానోత్‌ పార్వతిహతీరాం, భక్తులు మల్లం నరేందర్‌, భూక్య కస్నానాయక్‌, పుల్లఖండం రమేశ్‌బాబు, ఒబిలిశెట్టి కృష్ణ, వేణుగోపాల్‌, సతీష్‌, శ్రీనివాస్‌గుప్తా, కనకశేఖరం, శ్రీనివాస్‌, బాదావత్‌ చంటి, అర్చకులు అచ్యుతా చార్యులు, గోవిందాచార్యులు, కృష్ణచైతన్యచార్యు లు, హర్షవర్ధనచార్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement