కొత్త లెక్కలు! | - | Sakshi
Sakshi News home page

కొత్త లెక్కలు!

Oct 30 2026 2:09 AM | Updated on Oct 30 2026 2:09 AM

పాత వాహనాలకు

ఖిలా వరంగల్‌: మీ ఇంట్లో పాత బైక్‌ ఉందా..? ఎన్నో ఏళ్లుగా ఒకే కారును నడుపుతున్నారా..? అయితే వాటి వయస్సుతోపాటు రిజిస్ట్రేషన్‌ గడువుపైనా కన్నేయాల్సిందే. 15 ఏళ్లు దాటిన పాత వాహనానికి మరమ్మతులు చేయించి, ఇంధనం పోయించి రోడ్డెక్కుతామంటే కుదరదు. ముందు గ్రీన్‌ ట్యాక్స్‌ చెల్లించాలి. పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ తీసుకున్న తర్వాతే వాహనం కండీషన్‌ ఎలా ఉందో తనిఖీ చేయించాలి. ఆర్‌సీ పునరుద్ధరణకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. ఫీజులు చెల్లించి రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ (ఆర్‌సీ)ని రెన్యువల్‌ చేయించుకోవాలి. వ్యక్తిగత వాహనాలకు ఆర్‌సీ చెల్లుబాటు 15 ఏళ్లు. వాణిజ్య వాహనాలకై తే ఏడేళ్లే. అంతేకాదు..ప్రమాదం జరిగితే బీమా పొందలేరు. ఈ వాహనాలపై ఎలాంటి లావాదేవీలూ జరగవు.

గ్రీన్‌ ట్యాక్స్‌ ఎలా చెల్లించాలి..?

రవాణాశాఖ అధికారిక పోర్టల్‌లో లేదంటే సెల్‌ఫోన్‌ కు వచ్చే మెస్సెజ్‌ను క్లిక్‌ చేసి గ్రీన్‌ ట్యాక్స్‌ చెల్లించొ చ్చు. మొదట వాహనం రిజిస్ట్రేషన్‌ నంబర్‌తో పా టు చాసిస్‌ నంబర్‌లో చివరి ఐదు అంకెలను నమో దు చేయాలి. దరఖాస్తుదారు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, వాహనం రకం, మొబైల్‌ నంబర్‌ వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత చెల్లించాల్సిన గ్రీన్‌ ట్రాక్స్‌తో పాటు గతంలో బకాయిలుంటే కనిపిస్తాయి. చెల్లింపులు ఆన్‌లైన్‌లో పూర్తి చేసి రసీదును డౌన్‌లోడ్‌ చేసుకుని భద్ర పర్చుకోవాలి.

లెక్కమారుతోంది.

వాహనాల ప్రారంభ రిజిస్ట్రేషన్‌ 15 ఏళ్ల పాటు చెల్లుబాటులో ఉంటుంది. ఆ తర్వాత నిబంధనల ప్రకారం మరో ఐదేళ్లకు రెన్యువల్‌ చేసుకోవాలి. చాలా మంది వాహనాలకు గ్రీన్‌ ట్యాక్స్‌ చెల్లిస్తే పాత వాహనం ప్రక్రియ పూర్తయినట్లు భావిస్తారు. కానీ, గ్రీన్‌ ట్యాక్స్‌ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను. ఆర్‌సీ రెన్యువల్‌ వాహన రిజిస్ట్రేషన్‌ చెల్లుబాటును మరోసారి పునరుద్ధరించుకోవడం.. ఈరెండూ చేయాల్సిందే. వీటితోపాటు ఆర్‌సీ రెన్యువల్‌, సర్వీస్‌ చార్జ్‌, స్మార్ట్‌ కార్డ్‌ ఫీజులు కూడా కలిపి చెల్లించాలి.

ఎంత భారం పడుతుందంటే..

గ్రీన్‌ ట్యాక్స్‌తోపాటు రెన్యువల్‌ ఫీజు, సర్వీస్‌ చార్జీ, స్మార్ట్‌ కార్డు ఫీజు కలిపితే పాత వాహనదారులపై ఎంత భారం పడుతుందంటే..15 ఏళ్లు దాటి 20 ఏళ్ల లోపు ఉన్న ద్విచక్రవాహనానికి మొత్తం రూ. 3,400, కారుకు రూ. 7,700 అవుతుంది. 20 ఏళ్లు దాటిన ద్విచక్ర వాహనానికి రూ.5,700, కారుకు రూ.12,700 చెల్లించాలని రవాణాశాఖ చెబుతోంది.

రెన్యువల్‌ చేయాలంటే?

ఆర్‌సీ రెన్యువల్‌ చేయాలంటే ఫామ్‌ 25, ఒరిజనల్‌ ఆర్‌సీ, చెల్లుబాటలో ఉన్న బీమా పత్రం, కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రం(పీయూసీ), పన్ను చెల్లింపు వివరాల సిద్ధం చేసుకోవాలి. అనంతరం సంబంధిత రిజిస్ట్రేషన్‌ అథారిటీ సూచించిన తేదీలో వాహనాన్ని తీసుకెళ్లాలి. పత్రాల పరిశీలన, వాహన తనిఖీ, ఇతర నిబంధనలు పూర్తయ్యాక రెన్యువల్‌ ప్రక్రియ ముగుస్తుంది.

మినహాయింపులు..

ఎల్‌పీజీ, సీఎన్‌జీ , బ్యాటరీతో మాత్రమే నడిచే వాహనాలకు గ్రీన్‌ ట్యాక్స్‌ మినహాయింపులు ఉంటాయి. అయితే ఆర్‌సీ రెన్యువల్‌ కోసం స్మార్ట్‌ కార్డుకు చెల్లించాలి.

ఫీజుల వివరాలు ద్విచక్రవాహనం కారు

ఆర్‌సీ రెన్యువల్‌ రూ.1,000 రూ.2,000

సర్వీస్‌ చార్జీ రూ.200 రూ. 500

స్మార్ట్‌ కార్డు రూ.200 రూ. 200

గ్రీన్‌ ట్యాక్స్‌

(15–20)ఏళ్ల లోపు రూ.2,000 రూ.5,000

మొత్తం రూ.3,400 రూ. 7,700

20 ఏళ్లు దాటిన వాహనాలకై తే..

ఫీజుల వివరాలు బైక్‌ కారు

ఆర్‌సీ రెన్యువల్‌ రూ.1,000 2,000

సర్వీస్‌ చార్జీలు రూ.300 500

స్మార్ట్‌ కార్డు రూ.200 200

గ్రీన్‌ ట్యాక్స్‌ రూ.4,000 రూ.10,000

మొత్తం రూ.5,700 రూ.12,700

15 ఏళ్లు దాటితే 5 ఏళ్లు ఆర్‌సీ రెన్యువల్‌ చేసుకోవాలి

ముందుగానే ఇన్సూరెన్స్‌, గ్రీన్‌ ట్యాక్స్‌, పొల్యూషన్‌ పత్రాలు జత చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement