రేగొండ: కుటుంబ సభ్యుల ప్రాణాలు కాపాడబో యి ఓ వృద్ధుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఈ ఘటన గురువారం జయశంకర్ భూ పాలపల్లి జిల్లా కొత్తపల్లిగోరి మండలం గాంధీనగర్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకా రం.. గ్రామానికి చెందిన చామంతుల మల్లయ్య (70) కోడలు లావణ్య ఇంటి ఎదుట ఇనుప తీగపై దుస్తులు ఆరేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురైంది. పక్కనే ఉన్న తన కూతురు లావణ్యను పట్టుకోవడంతో ఇద్దరు షాక్‌కు గురయ్యారు. వెంటనే గమనించిన మల్లయ్య వారిని రక్షించే క్రమంలో షాక్‌కు గురై మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి భార్య కొమురమ్మ ఫిర్యాదు మేరకు కేసున నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై త్రిలోక్‌నాథ్ రెడ్డి తెలిపారు.
విద్యుదాఘాతంతో వృద్ధుడి మృతి
గాంధీనగర్‌లో ఘటన


