● బహుజన వాదం కోసం ముందడుగు
జనగామ: జిల్లా ప్రభుత్వ జ నరల్ ఆస్పత్రి (ప్రభుత్వ వైద్య కళాశాల) ప్రొఫెసర్ కల్నల్ భిక్షపతి రాజీనామా చేశారు. ఈ మేరకు గురువా రం ఆయన జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. 22 ఏళ్ల పాటు భారత సైన్యంలో దేశానికి సేవలందించిన తాను, ప్రస్తుతం బహుజన వాదం కోసం పని చేయాలని నిర్ణయించుకున్న ట్లు పేర్కొన్నారు. బహుజనులకు రాజ్యాధికారం దక్కాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న తీన్మార్ మల్లన్న భావజాలానికి ఆకర్షితుడై ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనా రిటీలు ఐక్యతతో రాజకీయంగా ఎదగాలని పిలుపునిచ్చారు. అన్ని రంగాల్లో బహుజనులు తమ ప్రాతి నిథ్యం పెంచుకోవాలని, బీసీ ముఖ్యమంత్రి లక్ష్యంగా ఐక్యంగా ముందుకు సాగాలన్నారు. బీసీ రాజ్యం వచ్చే వరకు మన ఓటు మనకే అనే నినాదంతో తీన్మార్ మల్లన్నకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.


