రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్‌ దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్‌ దుర్మరణం

Oct 30 2026 2:09 AM | Updated on Oct 30 2026 2:09 AM

● ధర్మారం బస్టాండ్‌ వద్ద ఘటన

● హెల్మెట్‌ ధరించినా దక్కని ప్రాణం

గీసుకొండ: వరంగల్‌ జిల్లా గీసుకొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని వరంగల్‌–నర్సంపేట రహదారి ధర్మారం బస్టాండ్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి మాజీ సర్పంచ్‌ చింతకింది అశోక్‌(73) మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. గురువారం రాత్రి 7 గంటలకు అశోక్‌ బైక్‌పై వరంగల్‌ వైపునకు వెళ్తున్నాడు. ఈక్రమంలో ధర్మారం బస్టాండ్‌ ప్రాంతానికి రాగానే అదే గ్రామానికి చెందిన దుపాకి సంధ్య, ఆమె కుమారుడు శ్రేయస్‌ రోడ్డు దాటుతుండగా బైక్‌ను అదుపు చేయడానికి యత్నించిన అశోక్‌ సడన్‌ బ్రేక్‌ వేయగా.. అదుపు తప్పి అక్కడే కింద పడి మృతి చెందాడు. హెల్మెట్‌ ధరించి ఉన్నా .. అతి వేగంతో వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగనట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన సంధ్యను ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement