వెంకటాపురం(ఎం): ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలంలోని చారిత్రక రామప్పలో నిర్వహిస్తున్న వరల్డ్ హెరిటేజ్ వలంటీర్ శిక్షణ శిబిరం ఏడో రోజు కొనసాగింది. గురువారం ఉదయం యోగా గురువు రాంబాబు ఆధ్వర్యంలో యోగాసానాలు నేర్పించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ గోవిందరాజు రోల్ ఆఫ్ టూరిజంపై వలంటీర్లకు వివరించారు. కేంద్ర పురావస్తు శాఖ సూపరింటెండెంట్ నిఖిల్ దాస్ హంపి ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన తర్వాత రామప్పలో చేసిన అభివృద్ధిపై వివరించారు. కేంద్ర పురావస్తు శాఖ డీఈ కృష్ణ చైతన్య వారసత్వ కట్టడాల పునర్నిర్మాణంలో చేసే వివిధ కార్యక్రమల గురించి వివరించారు. సాయంత్రం దేవాలయంలో పేరిణి నాట్య బృందం గురుశ్రీ, పేరిణి ప్రవీణ, గజ్జెల రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో కళాకారులు పల్నాటి శ్రీజ, బండారి తేజస్విని, గడ్డం విద్య, తుమ్మ వైష్ణవి, శ్రీ మహాలక్ష్మి, తుమ్మ సాన్విక, గురుదేవ్, సంతోష్, అన్నెల దేవి రాజేశ్ నృత్య ప్రదర్శన చేశారు. ఇది ఆహుతులను అలరించింది. ప్రొఫెసర్ పాండు రంగారావు, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ శ్రీధర్ రావు, కేంద్ర పురావస్తు శాఖ సీఏలు మల్లేశ్, భరత్, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ సభ్యుడు శ్రీనివాస్, టూరిజం గైడ్ విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.


