నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఓ ప్రైవేటు గోల్డ్‌లోన్ బ్యాంకులో బంగారాన్ని తనఖా పెట్టి రుణం తీసుకున్నానని, సమాచారం ఇవ్వకుండానే గోల్డ్‌ను వేలానికి పంపించారని ఆరోపిస్తూ ప్రవీణ్ అనే వ్యక్తి గురువారం ఆ బ్యాంకుకు తాళం వేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పట్టణానికి చెందిన ప్రవీణ్ స్థానిక ఓ ప్రైవేట్ గోల్డ్‌లోన్ బ్యాంకులో 12 తులాల బంగారు ఆభరణాలు తనఖా పెట్టి రూ.12లక్షల రుణం తీసుకున్నాడు. లోక్ యాక్టివ్‌లో ఉండగా ఇటీవల రూ.30వేలు జమ చేశానని ప్రవీణ్ తెలిపాడు. తీరా బ్యాంకుకు వస్తే గోల్డ్ వేలంలో పోయిందని బ్యాంకు వారు తెలుపుతున్నారని బాధితుడు వాపోయాడు. తమకు న్యాయం చేసి తిరిగి బంగారం ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నాడు. దీనిపై బ్యాంకు మేనేజర్ అనిల్‌ను వివరణ అడగగా ప్రవీణ్ గోల్డ్‌లోన్ పెట్టిన సమయంలోనే యాప్ ఇచ్చామని, అందులో ముందే సమాచారమిచ్చామని తెలిపారు. ఐదు నెలల పరిమితి ఉండగా ఆరు నెలలైనా రుణం చెల్లించకపోవడంతో వేలంలోకి వెళ్లిందని చెప్పారు.
బ్యాంకుకు తాళం వేసిన బాధితుడు
ముందే సమాచారమిచ్చాం : బ్యాంకు మేనేజర్


