స్టేషన్‌ఘన్‌పూర్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి గు ణపాఠం చెప్పాలని మాజీ మంత్రి , బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గురువారం డివి జన్ కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్గడ్ మండలాల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అధ్యక్షతన నిర్వహించిన స మావేశంలో దయాకర్‌రావు ముఖ్య అతిథిగా హాజ రై మాట్లాడారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా అవినీతికి పాల్పడడంతో రేవంత్ దిట్ట అని ఎద్దేవా చేశారు. అదేరీతిలో కడియం శ్రీహరి ఉన్నారని పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియను బాధ్యతాయుతంగా చేపట్టాలన్నారు. సమావేశంలో మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జ్ నాగుర్ల వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి, మండల అధ్యక్షుడు మాచర్ల గణేశ్, తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు


