కరువు జిల్లాగా ప్రకటించాలి | - | Sakshi
Sakshi News home page

కరువు జిల్లాగా ప్రకటించాలి

Oct 28 2026 1:06 AM | Updated on Oct 28 2026 1:06 AM

సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు నాగయ్య

నెహ్రూసెంటర్‌: ఎల్‌నినో, తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మహబూబాబాద్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జి.నాగయ్య డిమాండ్‌ చేశారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం గునిగంటి రాజన్న అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరువు పెరుగుతున్నందున కేంద్రం తక్షణమే రూ.50 కోట్ల ప్యాకేజీని ప్రకటించాలన్నారు. పంటలు చేతికొచ్చే దశలో ఉన్నందున సాగునీరు అందించాలన్నారు. రేషన్‌ దుకాణాల ద్వారా 14 రకాల వస్తువులు, బియ్యం పంపిణీ ప్రారంభించాలని, ఉపాధి పనులను 200 రోజులకు పెంచి పనులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సూర్నపు సోమయ్య, శెట్టి వెంకన్న, ఆకుల రాజు, అల్వాల వీరయ్య, కందునూరి శ్రీనివాస్‌, కుంట ఉపేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement