కరువు కోరల్లో ఓరుగల్లు పల్లెలు | - | Sakshi
Sakshi News home page

కరువు కోరల్లో ఓరుగల్లు పల్లెలు

Oct 28 2026 1:06 AM | Updated on Oct 28 2026 1:06 AM

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: వానాకాలం సాగు సీజన్‌లో ఉమ్మడి వరంగల్‌ పరిధిలోని 42 మండలాలకు కరువు సెగ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు ప్రభావిత మండలాల జాబితాలో ఉమ్మడి వరంగల్‌కు చెందిన ఆరు జిల్లాలు ఉన్నాయి. వీటిలో జనగామ జిల్లాలోని రఘునాథపల్లి మండలాన్ని తీవ్ర కరువు ప్రభావిత ప్రాంతంగా గుర్తించగా.. మిగిలిన 41 మండలాలను మోస్తరు కరువు కేటగిరీలో చేర్చింది. హనుమకొండ జిల్లాలో అత్యధికంగా 14 మండలాలు, వరంగల్‌లో 8, మహబూబాబాద్‌లో 7, జయశంకర్‌ భూపాలపల్లిలో 5, జనగామలో 4, ములుగులో 4 మండలాలు కరువు జాబితాలో ఉన్నాయి. వర్షపాతం, పంటల సాగు విస్తీర్ణం, నేలలో తేమ, భూగర్భజల పరిస్థితులు, ఉపగ్రహ ఆధారిత వృక్ష సంపద సూచీలు తదితర అంశాల ఆధారంగా ప్రభుత్వం కరువు తీవ్రతను అంచనా వేసి ప్రకటించింది. జిల్లా కలెక్టర్లు సంబంధిత మండలాలను నోటిఫై చేసి, కరువు సహాయక చర్యలు అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో కరువు కష్టాల్లో ఉన్న రైతులకు ఈ ప్రకటన ఆచరణాత్మకంగా ఎంత ఊరటనిస్తుందో వేచి చూడాలి.

హనుమకొండలో అత్యధికం..

వరంగల్‌లో ఎనిమిది..

● హనుమకొండ జిల్లాలోని వేలేరు, ఎల్కతుర్తి, కమలాపూర్‌, హసన్‌పర్తి, కాజీపేట, హనుమకొండ, ఐనవోలు, దామెర, ఆత్మకూరు, శాయంపేట, పరకాల, భీమదేవరపల్లి, ధర్మసాగర్‌, నడికూడ మండలాలు మోస్తరు కరువు ప్రభావిత జాబితాలో ఉన్నాయి.

● వరంగల్‌లో దుగ్గొండి, నర్సంపేట, చెన్నారావుపేట, సంగెం, పర్వతగిరి, నెక్కొండ, ఖిలా వరంగల్‌, వరంగల్‌ మండలాలు కరువు ప్రభావిత ప్రాంతాలుగా నమోదయ్యాయి.

● జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో మహదేవ్‌పూర్‌, ముత్తారం మహదేవ్‌పూర్‌, కాటారం, మల్హర్‌, కొత్తపల్లి (గోరి) మండలాలు మోస్తరు కరువు జాబితాలో ఉన్నాయి.

● జనగామ జిల్లాలో రఘునాథల్లి మండలాన్ని తీవ్ర కరువు ప్రభావిత ప్రాంతంగా గుర్తించారు. తరిగొప్పుల, జఫర్‌గఢ్‌, పాలకుర్తి మండలాలను మోస్తరు కరువు కేటగిరీలో చేర్చారు.

● మహబూబాబాద్‌ జిల్లాలో డోర్నకల్‌, కురవి, గూడూరు, నెల్లికుదురు, సిరోల్‌, కొత్తగూడ, ఇనుగుర్తిలు ఉన్నాయి.

● ములుగులో గోవిందరావుపేట, ఏటూరునాగారం, వెంకటాపురం, మంగపేట కరువు జాబితాలో ఉన్నాయి.

మిగతా మండలాలు జాబితాలో లేకపోవడాన్ని అక్కడ కరువు పరిస్థితులు లేవనే నిర్ధారణగా భావించలేమని, వర్షపాతం, సాగు, పంటల పరిస్థితులపై జిల్లాలవారీగా మరిన్ని వివరాలు పరిశీలించాల్సి ఉందని వ్యవసాయశాఖ అధికారి ఒకరు తెలిపారు.

42 మండలాలపై కరువు కాటు.. రైతన్నకు కష్టకాలం

జనగామ జిల్లా రఘునాథపల్లిని తీవ్ర కరువు ప్రాంతంగా గుర్తింపు

హనుమకొండలో అత్యధికంగా 14.. వరంగల్‌లో 8 మండలాలకు దెబ్బ

అధికారికంగా జాబితా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement