కేయూ క్యాంపస్: కేయూలో 15 ఏళ్ల తర్వాత 21 విభాగాల్లో 49 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో పీజీతోపాటు పీహెచ్‌డీ పూర్తిచేసి నెట్, సెట్ తదితర అర్హత సాధించిన ఎంతోమంది నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
విభాగాల వారీగా పోస్టులు ఇలా..
బాటనీ 2, బయోటెక్నాలజీ 1, బిజినెస్‌మేనేజ్‌మెంట్ 1, కామర్స్ 5, కెమిస్ట్రీ అండ్ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ 2, సెంట్రల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ సెంటర్ 2, ఎకనామిక్స్ 5, ఎడ్యుకేషన్ 1, ఇంగ్లిష్ 5, జియాలజీ 1, హిందీ 2, హిస్టరీ 3, ‘లా’ 1, లైబ్రరీ సైన్స్1, పొలిటికల్ సైన్స్ 1, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 4, సంస్కృతం 1, సోషియాలజీ 1, తెలుగు 3, ఉర్దూ 1, జువాలజీ 6 కాగా.. మొత్తంగా 49 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాల విధివిధానాలకు సంబంధించి గతంలోని 21వ జీఓను సవరణ చేసి 31 జీఓను ఇటీవల ప్రభుత్వం జారీచేసింది.
రోస్టర్ పాయింట్ల ఫిక్సేషన్
కేయూలోని 21 విభాగాల్లో 49 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అందుకు తొలుత విభాగాల వారీగా రోస్టర్‌లను ఐడింటిఫై, ఫిక్సేషన్ చేసి ఆ తర్వాత రోస్టర్ పాయింట్లకు సంబంధించిన వాటిపై వివిధ వెల్ఫేర్ డిపార్టుమెంట్ల అధికారుల నుంచి అప్రూవల్ తీసుకోవాలి. అన్ని సవ్యంగా జరిగితే 20 రోజుల్లో ఈప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. అనంతరం నియామకాలకు నోటిఫికేషన్ ఇస్తారు. 45 రోజుల గడువిచ్చి దరఖాస్తులు స్వీకరించాక రాష్ట్ర ఉన్నత విద్యామండలిలో స్క్రూటినీ చేపడతారు. 100 మార్కులకు ఈ ప్రక్రియ ఉంటుంది.
పీహెచ్‌డీ ఉంటే 30 మార్కులు..
అభ్యర్థుల అర్హతలు పరిశీలించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి (టీజీసీహెచ్‌ఈ) ఆధ్వర్యంలో ప్రత్యేక స్క్రీనింగ్ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఇంటర్వ్యూలకు అభ్యర్థుల ఎంపికలో భాగంగా అకడమిక్ రికార్డు, రీసెర్చ్ ఫర్‌ఫార్మెన్స్‌కు గరిష్టంగా 50 మార్కులు కేటాయించారు. ఇందులో గ్రాడ్యుయేషన్‌కు 80 శాతం మార్కులు పైబడితే 15 మార్కులు, 60నుంచి 80 శాతం మధ్య ఉంటే 13 మార్కులు, 55 నుంచి 60 శాతం మధ్య ఉంటే 10 మార్కులు, 45 నుంచి 55 శాతం మధ్య ఉంటే ఐదు మార్కులు కేటాయిస్తారు. పోస్టు గ్రాడ్యుయేషన్‌కు 80 శాతం మార్కులకు పైబడితే 25 మార్కులు, 60 నుంచి 80 శాతం మధ్య 23 మార్కులు, 55 నుంచి 60 శాతం మధ్య ఉంటే 20 మార్కులు కేటాయించనున్నారు. పీహెచ్‌డీ ఉన్న వారికి 30 మార్కులు ఉంటాయి. నెట్ విత్ జేఆర్‌ఎఫ్ ఉన్నవారికి 7 మార్కులు, నెట్‌కు 5 మార్కులు, స్లెట్‌కు మూడు మార్కులు లభించనున్నాయి. అలాగే, పీర్ రివ్యూడ్ జర్నల్స్‌లో ప్రచురితమైన ప్రతీరీసెర్చ్ పేపర్‌కు 2 మార్కుల చొప్పున గరిష్టంగా 10 మార్కులు, పోస్టు డాక్టరల్ /టీచింగ్ అనుభవానికి మరో 10 మార్కులు అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రస్ధాయి అవార్డులకు 2 నుంచి మార్కుల వరకు వెయిటేజీ ఉంటుంది.
ఇంటర్వ్యూ, డెమో కూడా..
కేటగిరీ బీ కింద డొమైన్ నాలెడ్జ్, బోధనా నైపుణ్యాల అంచనా కోసం మరో 30 మార్కులను కేటాయించారు. ఇందులో డెమో ద్వారా టీచింగ్ స్కిల్స్‌కు 10 మార్కులు, విషయ పరిజ్ఞానానికి 10, రీసెర్చ్ అప్టిట్యూడ్‌కు 5, బుక్స్‌పబ్లికేషన్స్‌కు 5, ఇంటర్వ్యూకు 20 మార్కులు ఉంటాయి.
అనుమతినిస్తూ ప్రభుత్వం
ఉత్తర్వులు జారీ
తొలివిడత 49 పోస్టుల భర్తీకి అవకాశం


