కాజీపేట మీదుగా బతుకమ్మ, దసరా ప్రత్యేక రైళ్లు.. | - | Sakshi
Sakshi News home page

కాజీపేట మీదుగా బతుకమ్మ, దసరా ప్రత్యేక రైళ్లు..

Oct 9 2026 1:20 AM | Updated on Oct 9 2026 1:20 AM

ఎన్‌హెచ్‌బీ పథకాలను వినియోగించుకోవాలి

● నేటినుంచి ప్రారంభం

కాజీపేట రూరల్‌ : బతుకమ్మ, నవరాత్రి, దసరా పండుగల దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం కాజీపేట జంక్షన్‌ మీదుగా ఈ నెల 9 నుంచి 25వ తేదీ వరకు సికింద్రాబాద్‌–సిర్పూర్‌కాగజ్‌నగర్‌–హైదరాబాద్‌ మధ్య 34 రైళ్లను ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్‌ గురువారం తెలిపారు.

వివరాలు..

అక్టోబర్‌ 9వ తేదీ నుంచి 25వ తేదీ వరకు 12:10 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరే సికింద్రాబాద్‌–సిర్పూర్‌కాగజ్‌నగర్‌ (07711) మధ్య ప్రయాణించే 17 డైలీ ఎక్స్‌ప్రెస్‌లు కాజీపేటకు 2:10 గంటలకు చేరుకొని 17:30 గంటలకు సిర్పూర్‌కాగజ్‌నగర్‌కు చేరుకుంటాయి. అక్టోబర్‌ 9వ తేదీ నుంచి 25వ తేదీ వరకు 18:00 గంటలకు సిర్పూర్‌కాగజ్‌నగర్‌లో బయలుదేరే సిర్పూర్‌కాగజ్‌నగర్‌–హైదరాబాద్‌ (07712) మధ్య ప్రయాణించే 17 డైలీ ఎక్స్‌ప్రెస్‌లు కాజీపేటకు 20:00 గంటలకు చేరుకుని 23:15 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటాయి. ఏసీ చైర్‌కార్‌, సెకండ్‌క్లాస్‌ సిట్టింగ్‌ క్లాస్‌ కోచ్‌లతో ప్రయాణించే ఈ రైళ్లకు చర్లపల్లి, భువనగిరి, జనగామ, కాజీపేట, జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆషిఫాబాద్‌రోడ్‌ స్టేషన్లలో అప్‌ అండ్‌డౌన్‌ రూట్‌లో హాల్టింగ్‌ కల్పించారు.

కాజీపేట మీదుగా వన్‌వే ఫెస్టివల్‌ స్పెషల్‌ ట్రైన్స్‌

కాజీపేట రూరల్‌ : వివిధ పండుగల దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం కాజీపేట జంక్షన్‌ మీదుగా హైదరాబాద్‌–హజ్రత్‌నిజాముద్దీన్‌, చర్లపల్లి–హజ్రత్‌నిజాముద్దీన్‌ మధ్య వన్‌ వే ఫెస్టివల్‌ స్పెషల్‌ ట్రైన్స్‌ నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్‌ గురువారం తెలిపారు.

ప్రత్యేక రైళ్ల వివరాలు..

అక్టోబర్‌ 9వ తేదీన రాత్రి 23: 25 గంటలకు బయలుదేరే హైదరాబాద్‌–హజ్రత్‌నిజాముద్దీన్‌ (0703 1) ప్రత్యేక రైలు కాజీపేటకు మరుసటి రోజు తెల్ల వారు జామున 01: 30 గంటలకు చేరుకుంటుంది.

అక్టోబర్‌ 11వ తేదీన రాత్రి 23: 55 గంటలకు బయలుదేరే చర్లపల్లి–హజ్రత్‌నిజాముద్దీన్‌ (07035) ప్రత్యేక రైలు కాజీపేటకు మరుసటి రోజు తెల్లవారుజామున 2:00 గంటలకు చేరుకుటుంది. ఈ రైళ్లకు సికింద్రాబాద్‌, కాజీపేట, బల్లార్షా, నాగ్‌పూర్‌, ఇటార్సీ, జబల్‌పూర్‌, కఠ్నీ, సంత, చిత్రకుట్‌, ధామ్‌కర్‌వి, బాందా, విజిఎల్‌ ఝాన్సీ, గ్వాలియర్‌, ఆగ్రాలో హాల్టింగ్‌ కల్పించారు.

కేవీకే సీనియర్‌ శాస్త్రవేత్త, అధిపతి అరుణ్‌జ్యోతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement