వంట సిబ్బందికి వైద్యపరీక్షలు నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

వంట సిబ్బందికి వైద్యపరీక్షలు నిర్వహించాలి

Oct 1 2026 5:04 AM | Updated on Oct 1 2026 5:04 AM

నెల్లికుదురు: ప్రభుత్వ విద్యాసంస్థల్లో పనిచేసే వంట సిబ్బందికి కచ్చితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, నివేదికలు సమర్పించాలని కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ వైద్యాధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రికా ర్డులు, ఆస్పత్రి పరిసరాలను పరిశీలించి ఆసహనం వ్యక్తం చేశారు. ప్రజలకు వైద్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలన్నారు. షెడ్యూల్‌ ప్రకారం మెడికల్‌ క్యాంపులు నిర్వహించి మలేరియా, డెంగీ, చికెన్‌ గున్యా లాంటి సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఆస్పత్రిలో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, గర్భిణులకు, బాలింతలు, పిల్లలకు క్రమం తప్పకుండా టీకాలు వేయాలన్నారు. అనంతరం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో తరగతి గదులను తనిఖీ చేసి మాట్లాడారు. కార్యక్రమంలో డీఐఈఓ మదార్‌, జిల్లా వైద్యాధికారి రవి రాథోడ్‌, తహసీల్దార్‌ చంద నరేష్‌, ఎంపీడీఓ సింగారపు కుమార్‌, ప్రిన్సిపాల్‌ వీరస్వామి, మండల వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

కలెక్టర్‌ స్నేహ శబరీష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement