రీ సర్వేతో భూ సమస్యలు పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

రీ సర్వేతో భూ సమస్యలు పరిష్కారం

Oct 1 2026 5:04 AM | Updated on Oct 1 2026 5:04 AM

● అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌

తొర్రూరు రూరల్‌: రీ సర్వేతో భూ సమస్యలు పరిష్కారమవుతాయని అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని కొమ్మనపల్లి గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ సర్వేను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్వే తీరును పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులతో మాట్లాడి భూములకు సంబంధించిన సమస్యలను తెలుసుకున్నారు. రీ సర్వే పూర్తి అయితే భూ సమస్యలకు పరిష్కారం లభిస్తోందన్నారు. సర్వే పనులను సమర్థవంతంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏడీ శ్రీనివాస్‌, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, సర్వేయర్‌ గురువేశ్‌, జీపీఓ లలిత, లైసెన్స్‌ సర్వేయర్లు, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement