హామీల అమలులో ప్రభుత్వం విఫలం | - | Sakshi
Sakshi News home page

హామీల అమలులో ప్రభుత్వం విఫలం

Oct 1 2026 5:04 AM | Updated on Oct 1 2026 5:04 AM

● మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌

మహబూబాబాద్‌: హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజలకు అన్ని విషయాలు అర్థమవుతున్నాయని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ హయాంలోనే గిరిజనులకు న్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం సంతు సేవాలాల్‌ పేరుతో కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి నేటికీ ఊసేలేదన్నారు. 10ఏళ్ల కేసీఆర్‌ పాలన స్వర్ణ యుగమని, మళ్లీ కేసీఆర్‌ సీఎం కావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారన్నారు. బీఆర్‌ఎస్‌ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం మాజీ సీఎం కేసీఆర్‌ ఎంతో కృషి చేశారన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో భాగంగా అర్హులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ ఆంగోతు బిందు, నాయకులు ఫరీద్‌, అశోక్‌ తదితురులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement