● 9వ తరగతికే అన్ని జిల్లాల్లో
వాల్యుయేషన్
● నేటినుంచి ఎస్‌ఏ–1 పరీక్షలు
విద్యారణ్యపురి : అన్ని యాజమాన్యాల పాఠశాలల విద్యార్థులకు గురువారం(నేడు) నుంచి సమ్మిటివ్ అసెస్‌మెంట్ (ఎస్‌ఏ–1)పరీక్షలు నిర్వహించనున్నారు. ఈమేరకు అన్ని జిల్లాల్లో డీసీఈబీల ద్వారా ప్రశ్నపత్రాలు పంపిణీ చేశారు. 1వ తేదీ నుంచి 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు, 1 నుంచి 5వతరగతి విద్యార్థులకు అక్టోబర్ 5 నుంచి ఎస్‌ఏ–1 పరీక్షలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 9వతేదీన ముగి యనున్నాయి. అయితే 1 నుంచి 9వ తరగతి వరకు నిర్వహించే ఎస్‌ఏ–1పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకన విధానంలో మార్పులు తీసుకొస్తూ విద్యాశాఖ ఆగస్టు చివరి వారంలో ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటి వరకు ఈ పరీక్షల జవాబుపత్రాలను ఆయా పాఠశాలల్లోనే ఉపాధ్యాయులే మూల్యాంకనం చేసేవారు. అందుకు భిన్నంగా ఈ విద్యాసంవత్సరం నుంచి వేరే పాఠశాలల ఉపాధ్యాయులు నిర్వహించే ప్రక్రియ అమల్లోకి తీసుకురానున్నట్లు విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. అయితే ఈ నూతన మూల్యాంకన విధానంపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం తెలిపాయి. దీంతో బుధవారం సాయంత్రం పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు.. ఉపాధ్యాయ సంఘాలతో చర్చించారు. ఈ నేపథ్యంలో ఈ మూల్యాంకన ప్రక్రియలో సవరణలు చేశారు. దీని ప్రకారం 9వతరగతి విద్యార్థుల పరీక్షల జవాబుపత్రాలను మాత్రమే బాహ్యమూల్యాంకనం అన్ని జిల్లాల్లో చేయనున్నారు. ఒక పాఠశాలలోని 9వతరగతి విద్యార్థులు రాసిన పరీక్షల జవాబుపత్రాలను మరో పాఠశాల ఉపాధ్యాయులు మూల్యాంకనం చేయనున్నారు. దీనిని ప్రయోగాత్మకంగా చేస్తారు. అయితే ఆరో తరగతి విద్యార్థుల పరీక్షల జవాబుపత్రాలను మాత్రం రాష్ట్రంలో ఎంపిక చేసిన 9 జిల్లాల్లో బాహ్యమూల్యాంకనం చేస్తారు. వీటిలో ఉమ్మడి వరంగల్‌లోని ములుగు, మహబూబాబాద్ జిల్లాలున్నాయి. మిగతా హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మేడ్చల్, సంగారెడ్డి ఉన్నాయి.
కేయూలో పలువురు అధికారుల నియామకం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో పలువురు అధికారులను నియమిస్తూ బుధవారం రిజిస్ట్రార్ రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. వర్సిటీ అదనపు పరీక్షల నియంత్రణాధికారిగా ఇంగ్లిష్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ దీపాజ్యోతి, కేయూ అకడమిక్ ఆడిట్ డీన్‌గా యూనివర్సిటీ ‘లా’ కళాశాల ప్రొఫెసర్ శ్రీనివాస్, హనుమకొండలోని యూనివర్సిటీ మహిళా పీజీ కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్‌గా అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మల, మహిళా పీజీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్‌గా రాజనీతి శాస్త్ర విభాగం కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సంకినేని వెంకట్, కేయూ అడ్మిషన్ల జాయింట్ డైరెక్టర్‌గా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగం కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎ.శ్రీనివాస్‌ను నియమిస్తూ రిజిస్ట్రార్ రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు.
తండ్రిని చంపిన
తనయుడి అరెస్ట్
● వివరాలు వెల్లడించిన పోలీసులు
కురవి: తండ్రిని చంపిన కొడుకును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరించినట్లు మరిపెడ సీఐ పవన్‌కుమార్, సీరోలు ఎస్సై సంతోష్ బుధవారం తెలి పారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూదనపల్లిలో తండ్రి లకుమల్ల వెంకన్న(58)ను కొడుకు సునీల్ సోమవారం రాత్రి ఇంట్లో చంపినట్లు తెలిపారు. తల్లిని కొడుతున్నాడనే కారణంతో తండ్రిని హత్య చేసిన ఘ టనలో సునీ ల్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించనట్లు వారు వివరించారు.


