విద్యారంగ సమస్యల పరిష్కారానికి పోరాటం | - | Sakshi
Sakshi News home page

విద్యారంగ సమస్యల పరిష్కారానికి పోరాటం

Oct 1 2026 1:17 AM | Updated on Oct 1 2026 1:17 AM

కాజీపేట రూరల్‌ : విద్యారంగ సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ మాజీ అధ్యక్షుడు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. కాజీపేట ఫాతిమానగర్‌ బాలవికాస కేంద్రంలో బుధవారం ఏఐఎస్‌ఎఫ్‌ 90వ వార్షికోత్సవ ముగింపు వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల వరకు వివిధ సమస్యలతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారన్నారు. దీనిపై ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ నిధులు వెంటనే విడుదల చేసి డిగ్రీ, పీజీ కళాశాలలు, యూనివర్సీటీల్లో ఖాళీ ఆధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.

ఏఐఎస్‌ఎఫ్‌ జాతీయ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసరావు

ముగిసిన సంఘం

90వ వార్షికోత్సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement