హన్మకొండ: హనుమకొండ నయీంనగర్‌లోని వాగ్దేవి డిగ్రీ, పీజీ కళాశాల (అటానమస్) పీజీ ద్వితీయ సెమిస్టర్ ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం కళాశాలో ప్రిన్సిపాల్ ఎ.శేషాచలం, వైస్ ప్రిన్సిపాల్ పి.హరీందర్ రెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి సి.దత్తాత్రేయులు ఫలితాలు విడుదల చేశారు. మొత్తం 90.26 శాతం ఉత్తీర్ణత సాధించారని వారు తెలిపారు. 154 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 139 మంది ఉత్తీర్ణులయ్యారు. ఎంకాం (జనరల్), ఎమ్మెస్సీ ఫిజిక్స్, ఎమ్మెస్సీ మ్యాథ్‌మెటిక్స్ కోర్సులు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఎమ్మెస్సీ జువాలజీ 96.15 శాతం, ఎమ్మెస్సీ న్యూట్రీషన్, డైటెటిక్స్ 93.94 శాతం, ఎమ్మెస్సీ ఫుడ్ సైన్స్, టెక్నాలజీ 94.59 శాతం, ఎమ్మెస్సీ మైక్రోబయాలజీ 95.65 శాతం ఉత్తీర్ణత నమోదు చేశాయి. ఎంకాం (కంప్యూటర్ అప్లికేషన్స్) 75 శాతం, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ 37.50 శాతం, ఎమ్మెస్సీ డేటా సైన్స్ 81.82 శాతం ఉత్తీర్ణత నమోదు చేశాయి. కార్యక్రమంలో ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ రాజాప్రసాద్, అన్ని విభాగాల అధిపతులు పాల్గొన్నారు.


